ETV Bharat / business

ఛోక్సీని భారత్​కు అప్పగించనున్న ఆంటిగ్వా!

పీఎన్​బీ కేసు నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని భారత్​కు అప్పగిస్తామని ఆంటిగ్వా ప్రధానమంత్రి గ్యాస్టన్​ బ్రౌన్​ ప్రకటించారు. న్యాయపరమైన అంశాలను ఉల్లంఘించినందుకు ఛోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ విషయమై ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ స్పష్టంచేశారు.

ఛోక్సీని భారత్​కు అప్పగించనున్న ఆంటిగ్వా!
author img

By

Published : Jun 25, 2019, 2:17 PM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్​ ఛోక్సీకి ఆంటిగ్వా ప్రభుత్వం షాకిచ్చింది. న్యాయపరమైన ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆ దేశం కల్పించిన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ఆంటిగ్వా ప్రధాని గ్యాస్టన్​ బ్రౌన్​ ప్రకటించారు. ఫలితంగా ఛోక్సీని భారత్​కు అప్పగించేందుకు మార్గం సులువైంది.

"ఆయన(ఛోక్సీ) పౌరసత్వాన్ని మేం రద్దు చేస్తున్నాం. ఆయన్ను భారత్​కు పంపించివేస్తాం. మా దేశం నేరస్థులకు ఆశ్రయం ఎన్నటికీ కాబోదు. అయితే మొదటగా మేం ఇందుకు అంగీకరించలేదు. కానీ ఛోక్సీ న్యాయపరమైన అంశాలను ఉల్లంఘించారు. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం."
-గ్యాస్టన్​ బ్రౌన్​, ఆంటిగ్వా ప్రధాని

పీఎన్​బీ కుంభకోణం కేసులో ఛోక్సీతో పాటు ఆయన అల్లుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకును రూ.13,400 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. నీరవ్​ మోదీ బ్రిటన్​కు పారిపోగా అక్కడి ప్రభుత్వం ఇటీవలే అరెస్టు చేసింది.

సమాచారం లేదు: భారత్​

మీడియాలో వస్తున్న కథనాలపై భారత్​ స్పందించింది. ఆంటిగ్వా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ చెప్పారు.

Geneva (Switzerland), Jun 25 (ANI): While speaking to ANI on enforced disappearances in Pakistan, president of the Baloch Republican Party Brahumdagh Bugti said, "Pakistani state authorities have been using enforced disappearances as a tool to crush the voice of oppressed people like Balochs, Pashtuns, Muhajirs, Sindhis and other religious minorities." "On one hand, Pakistan is a signatory of international conventions against enforced disappearances and on the other, they are busy abducting people. We urge international community to take action against enforced disappearances of Baloch and other people in Pakistan," he added.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.