ETV Bharat / business

100 బిలియన్​ డాలర్ల క్లబ్​లో మార్క్​ జుకర్​బర్గ్ - ఇన్​స్టాగ్రామ్​ రీల్స్ ఫీచర్​

టిక్​టాక్​కు పోటీగా ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్ ఫీచర్​ అందుబాటులోకి తెచ్చింది మాతృ సంస్థ ఫేస్​బుక్​. దీనితో అమెరికా మార్కెట్లలో ఫేస్​బుక్ షేర్లు భారీగా పుంజుకుని.. సంస్థ అధినేత జుకర్​బర్గ్​ సంపద తొలిసారి 100 బిలియన్ డాలర్ల మార్క్​ దాటింది.

Mark Zuckerberg net worth rise
భారీగా పెరిగిన మార్క్​ జుకర్​బర్గ్​ సంపద
author img

By

Published : Aug 7, 2020, 1:36 PM IST

ఫేస్​బుక్​ అధినేత మార్క్ జుకర్​బర్గ్ సంపద 100 బిలియన్ డాలర్లు దాటింది. అమెరికా స్టాక్ మార్కెట్లో ఫేస్​బుక్ షేర్లు భారీగా లాభపడటం వల్ల మార్క్ సంపద ఈ స్థాయికి చేరింది. దీనితో ఇప్పటి వరకు 100 బిలియన్ డాలర్ల సంపద మార్క్​ దాటిన జెఫ్ బెజోస్​, బిల్​గేట్స్​ సరసన చేరారు జుకర్​బర్గ్.

మార్క్ జుకర్​బర్గ్ సంపద ఆయనకు ఫేస్​బుక్​లో ఉన్న 13 శాతం వాటా ద్వారానే అధికంగా పెరిగినట్లు బ్లూమ్​బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్​ నివేదిక పేర్కొంది.

సంపద పెరిగేందుకు కారణాలు..

టిక్​ టాక్​కు పోటీగా ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది ఫేస్​బుక్​. ఇప్పటికే భారత్​లో నిషేధం ఎదుర్కొంటున్న టిక్​టాక్​పై అమెరికాలోనూ ప్రభుత్వం నుంచి ఆంక్షలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో టిక్​టాక్​కు ఉన్న మార్కెట్​ను రీల్స్​ దక్కించుకోగలుగుతుందనే అంచనాలతో ఫేస్​బుక్​ షేర్లు భారీగా పెరిగాయి. ఫలితంగా మార్క్​ జుకర్​బర్గ్ సంపద కూడా ఈ స్థాయికి చేరింది.

కరోనా సంక్షోభంలోనూ సంపద పరుగులు..

కరోనాతో నెలకొన్న పరిస్థితులతో ప్రపంచమంతా సంక్షోభం నెలకొంది. ఇలాంటి సమయాల్లోనూ.. అమెరికా టెక్​ దిగ్గజాల అధినేతల సంపద భారీగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జుకర్​బర్గ్​ సంపద 22 బిలియన్ డాలర్లు పెరగ్గా.. అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్ సంపద 75 బిలియన్​ డాలర్లు వృద్ధి చెందింది.

ఇదీ చూడండి:ఎల్​ఐసీ అండతో ఎస్​ బ్యాంక్ జోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.