దేశవ్యాప్తంగా 99.99 శాతం ప్రాంతాలకు జియో నెట్ వర్క్ అందుబాటులోకి తేనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం చేసే వారికి ఇది సహాయం చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఫేస్బుక్ ఫ్యుయల్ ఫర్ ఇండియా సదస్సులో వర్చ్‌వల్‌గా పాల్గొన్న అంబానీ ఈ విషయాలు వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా ఆలోచనలతోనే ఇది సాధ్యమవుతున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. భారత్‌లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టినందుకు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.