ETV Bharat / business

ఉద్యోగుల్లో కరోనా గుబులు- సంస్థల 'హ్యాపీనెస్' క్లాస్​లు

కరోనా ప్రభావం అన్ని రంగాలను కుదిపేస్తోంది. తమ ఉద్యోగం ఉంటుందో, పోతుందోనని అనేక మంది ఆందోళనకు గురవుతున్నారు.  పలు సంస్థలు ఇప్పటికే ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. ప్రోత్సాహకాలను నిలిపివేశాయి. ఉద్యోగులు ఎక్కువ ఒత్తిడికి  లోనవకుండా కొన్ని సంస్థలు 'హ్యాపీనెస్ సెషన్స్​ను' నిర్వహిస్తున్నాయి.

job loss fears rise
ఉద్యోగుల్లో కరోనా గుబులు- సంస్థల 'హ్యాపీనెస్' తరగతులు
author img

By

Published : Apr 12, 2020, 6:30 PM IST

కరోనా సంక్షోభం, దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కారణంగా ఉద్యోగులు తమ భవిష్యత్తుపై భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు జీతాల్లో కోతలు విధించాయి. ఏప్రిల్​లో ఇవ్వాల్సిన పోత్సాహకాలను నిలిపివేశాయి. నియామకాలను ఆపేశాయి. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగం ఉంటుందో, పోతుందోనని అనేక మంది ఒత్తిడికి లోనవుతున్నారు.

భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు కొన్ని సంస్థలు తమ సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మానసిక నిపుణులతో 'హ్యాపీనెస్ సెషన్లు' నిర్వహిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించిన విషయాలను తరచూ చర్చిస్తున్నాయి. ఎలాంటి అభద్రతకు లోనవద్దని సూచిస్తున్నాయి. ఈ క్లిష్ట సమయాల్లో ఎక్కువ సమయం ఆఫీస్​లో గడిపిన వారికి అదనపు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నాయి.

గతంలో ఎన్నడూ చూడని పరిస్థితి

ఉద్యోగులు, సంస్థలు గతంలో ఎన్నడూ చూడని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. లాక్​డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక ఉద్యోగుల మానసిక సవాళ్లు మరింత తీవ్రతరం అవుతున్నాయని అంటున్నారు.

" ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఉద్యోగులతో పాటు సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ప్రోత్సాహకాలపై సంస్థలు ఏ నిర్ణయం తీసుకుంటాయో ఇప్పుడే చెప్పలేం. కొవిడ్-19 ప్రభావం వ్యాపార సంస్థలపై తీవ్రంగా ఉంది"

-సుదీప్​ సేన్​, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగా​ బిజినెస్​ హెడ్

ఆ ఉద్యోగుల్లో భయం

లాక్​డౌన్ సమయంలోనూ రిటైల్, ఆహారం, ఇతర రంగాల్లోని అత్యవసర విభాగాల్లో కొందరు విధులు నిర్వహిస్తున్నారు. సహోద్యోగులు, ఇతర కారణాల వల్ల తమకూ వైరస్ సోకుతుందేమోనని వీరంతా భయాందోళనతో ఉన్నారు. అలాంటి వారికి పలు సంస్థలు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. శానిటైజర్లు, మాస్కులు, ప్రత్యేక రవాణా వంటి సదుపాయాలు ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నాయి.

"మా స్టోర్లలో విధులు నిర్వహిస్తూ నిస్వార్థంగా సేవలందిస్తున్న సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారందరికీ ప్రోత్సాహకంగా రోజుకు రూ.200 అలవెన్స్​ ఇస్తున్నాం."

-వాల్​మార్ట్ అధికార ప్రతినిధి.

భవిష్యత్తుపై అనిశ్చితి, అభద్రతా భావం నెలకొన్నప్పుడు ఆందోళన ఎక్కువగా ఉంటుందని ప్రముఖ మానసిక నిపుణులు, హ్యాపీనెస్ కోచ్​ సాక్షి మాంఢ్యన్ తెలిపారు. భవిష్యత్తు గురించి చింత చేయడం మాని ప్రస్తుతం మన చేయగలిగిన విషయాలపై దృష్టి సారిస్తే ఆనందంగా ఉండవచ్చని చెబుతున్నారు.

" ఉద్యోగం ఉంటుందో, పోతుందో మన చేతుల్లో ఉండదు. కానీ ఎంత ఖర్చు చేయాలనే విషయం మన చేతుల్లోనే ఉంటుంది. అనవసర, విలాసవంతమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపుగా ఉండాలి. ఇలా చేస్తే ఉద్యోగం ఉన్నా లేకపోయినా కొద్ది రోజలు పాటు సంతోషంగా జీవించవచ్చు. ఆ తర్వాత వృత్తి గురించి నిర్ణయం తీసుకోవచ్చు."

-సాక్షి మాంఢ్యన్, మానసిక నిపుణులు.

కొత్త పరిస్థితులకు అలవాటు పడటం మనుషులకున్న గొప్ప లక్షణమని చెప్పారు మాంఢ్యన్​. ప్రారంభంలో ఇబ్బందులు ఎదురైనా తర్వాత మార్పు వస్తుందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మనం అలవాటుపడొచ్చని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: '1991 తర్వాత ఇదే అత్యల్పం.. భారత వృద్ధి 1.5 శాతమే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.