ETV Bharat / business

వాటి కోసం ఈ-కామర్స్​ సైట్స్​లో తెగ వెతికేస్తున్నారట!

లాక్​డౌన్​ ఆంక్షలకు కొన్ని సడలింపులు చేస్తూ.. ఆరెంజ్​, గ్రీన్​ జోన్లలో అత్యవసరం సహా ఇతర వస్తువుల అమ్మేలా ఈ-కామర్స్​ సంస్థలకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రజలు ఆన్​లైన్​లో ఎక్కువగా వేటి కోసం వెతుకుతున్నారో తెలుసా?

author img

By

Published : May 6, 2020, 3:31 PM IST

Flipkart
ఆన్​లైన్​లో వీటి కోసమే తెగ వెతికేస్తున్నారటా!

లాక్​డౌన్​లో దుకాణాలన్నీ బంద్. హెయిర్​ కట్​ చేసుకోవడం ఎలానో ఎవరికీ తెలియదు. ప్రయోగాలు ఏమైనా చేద్దామంటే తగిన సరంజామా లేదు. లాక్​డౌన్​ ముగిసినా, ఆంక్షలు సడలించినా... గతంలోలా ధైర్యంగా సెలూన్​కు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే అందరి దృష్టి ఇప్పుడు 'ట్రిమ్మర్'​పై పడింది. సాధ్యమైనంత త్వరగా ఒకటి కొనుక్కోవాలని చూస్తున్నారు అంతా. సరసమైన ధరకు మంచి ట్రిమ్మర్​లు ఏమున్నాయోనని ఈ-కామర్స్​ సైట్లలో తెగ వెతికేస్తున్నారు.

15 రోజులుగా టాప్​-10లోనే

వినియోగదారులు అత్యధికంగా శోధించిన టాప్​-10 జాబితాలో గత 15 రోజులుగా.. ట్రిమ్మర్లు ఉన్నట్లు తెలిపింది ఫ్లిప్​కార్ట్​. ఏప్రిల్​ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వీటి కోసం వెతికిన వారి సంఖ్య 4.5 రెట్లు పెరిగిందని వెల్లడించింది. గ్యాస్​ స్టౌవ్​ల కోసం వెతుకుతున్న వారి సంఖ్య రెండింతలు అయినట్లు తెలిపింది. అయితే.. ఫ్యాన్లు, ఏసీల పరిస్థితి ఏటా వేసవిలో ఎలా ఉంటుందో అదే రీతిలో ఉన్నట్లు స్పష్టం చేసింది.

కొన్ని రాష్ట్రాల్లో ఆరెంజ్​, గ్రీన్​ జోన్లలో అత్యవసర, ఇతర ఉత్పత్తుల అమ్మకాలకు ఈ-కామర్స్​ సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో.. ల్యాప్​టాప్స్​, మొబైల్స్​, ఏసీ, కూలర్స్​, టీ-షర్ట్స్​ వంటి వాటి కోసం ఎక్కువగా వెతకటాన్ని గుర్తించాం. దేశవ్యాప్తంగా లక్షల మంది అమ్మకందారులు, ఎంఎస్​ఎఈలతో కలిసి మా సంస్థ పనిచేస్తోంది. ప్రస్తుత సమయంలో వినియోగదారులకు ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు మా సంస్థ ప్రయత్నిస్తోంది. సురక్షితమైన, శానిటైజ్ చేసిన​ సరఫరా చైన్​తో వినియోగదారుల ఇంటికి ఉత్పత్తులను చేరవేసేందుకు నిరంతరం సేవలందిస్తుంది ఫ్లిప్​కార్ట్​. ప్రభుత్వ, స్థానిక అధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా సేవలు కొనసాగుతాయి.

– అనిల్​ గోటేటి, సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​, ఫ్లిప్​కార్ట్​

ఆన్​లైన్​కే ప్రజలు ఓటు..

కరోనా భయాలతో ప్రజలు బయటకు పెద్దగా వచ్చే పరిస్థితులు లేనందున.. ఇదే ట్రెండ్​ కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం చిన్న దుకాణాలను అనుమతించి.. మాల్స్​, పెద్ద మార్కెట్లకు మూసి ఉంచితే.. హోండెలివరీ కోసం ప్రజలు ఆన్​లైన్​ స్టోర్స్​పైనే ఆధారపడతారని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ… గిడ్డంగులు, లాజిస్టిక్స్​లో సిబ్బంది కొరత కారణంగా డెలివరీలో జాప్యం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.