దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం 'ఎల్జీ' భారత మార్కెట్లో 'జీ' సిరీస్‌లో మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. మడత ఫోన్లను దీటుగా ఎదుర్కొనేందుకు రెండు తెరలతో 'జీ8ఎక్స్ థింక్యూ' పేరుతో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
'జీ8ఎక్స్ థింక్యూ' రెండు తెరల్లో రెండు వేర్వేరు యాప్‌లు ఒకేసారి వాడుకునే వెసులుబాటు ఉన్నట్లు ఎల్జీ వెల్లడించింది. మల్టీ టాస్కింగ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త అనుభూతినిస్తుందని తెలిపింది. ఎల్జీ స్మార్ట్ కీబోర్డ్ ఫీచర్‌తో.. మినీ ల్యాప్‌టాప్‌లా ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది.
రెండు తెరలతో వచ్చిన ఈ కొత్త మోడల్ ధరను రూ.49,999గా నిర్ణయించింది ఎల్జీ. రేపటి నుంచి ఈ ఫోన్లు కొనుగోళ్లకు అందుబాటులో ఉండనున్నాయి.
జీ8ఎక్స్ థింక్యూ ఫీచర్లు..
- 6.40 అంగుళాలతో రెండు ఓఎల్ఈడీ డిస్ప్లేలు, వాటర్ డ్రాప్ నాచ్
- ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజి
- 12 ఎంపీ+13 ఎంపీలతో వెనుకవైపు రెండు కెమెరాలు
- 32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- అండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టమ్
- 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇదీ చూడండి:2019-20 భారత జీడీపీ వృద్ధి రేటు 4.6 శాతమే!