ETV Bharat / business

ఉంటుందా.. ఊడుతుందా? ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన - NEWS ON COMPUTER JOBS

ఆర్థిక మందగమనం నేపథ్యంలో వ్యయాలు తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాయి ఐటీ సంస్థలు. దానికి తోడు సాంకేతిక మార్పులతో మధ్యస్థాయి ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా అని ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.

ఐటీ ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా?
author img

By

Published : Nov 25, 2019, 3:15 PM IST

నిన్న మొన్నటి వరకూ దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో మందగమనం వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవలసిన పరిస్థితి కనిపించింది. అన్ని వర్గాలు దీనిపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు చర్చనీయాంశంగా మారింది. వ్యయాలు తగ్గించుకునే ఉద్దేశం కావచ్చు, లేదా సాంకేతిక మార్పుల ఫలితమో.. కానీ ఉద్యోగాల కోతను ప్రకటిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితి ఐటీ నిపుణులను, ముఖ్యంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులను, వారి తల్లితండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోయేందుకూ తావిస్తోంది.

ఐటీ రంగంలో వచ్చే ఏడాది కాలంలో 30,000 నుంచి 40,000 మంది మధ్యస్థాయి ఉద్యోగులను కంపెనీలు తొలగించే అవకాశం ఉందంటూ నిన్నటికి నిన్న ఐటీ రంగ నిపుణుడు, ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌ దాస్‌ పాయ్‌ బాంబు పేల్చటం గమనార్హం.

ఈ కంపెనీల్లో తగ్గుతున్నాయి..

  • యూఎస్‌కు చెందిన కాగ్నిజెంట్‌ ఈ నెల మొదటి వారంలో ఉద్యోగాల కోతను ప్రకటించింది. వచ్చే కొద్ది నెలల్లో 10,000 నుంచి 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈఓ బ్రియాన్‌ హంఫెరీస్‌ స్పష్టం చేశారు. ఏ దేశంలో ఎంతమందిని తొలగిస్తారనేది చెప్పనప్పటికీ, మనదేశంపై అధిక ప్రభావం ఉంటుందనేది విస్పష్టం. కాగ్నిజెంట్‌ ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మనదేశంలోనే పనిచేస్తున్నారు. కొన్ని విభాగాల నుంచి తాము వైదొలుగుతున్నట్లు, అందువల్ల ఉద్యోగాల కుదింపు అనివార్యంగా మారినట్లు కాగ్నిజెంట్‌ వివరించింది.
  • దేశీయ ఐటీ దిగ్గజమైన ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 నుంచి 150 మిలియన్‌ డాలర్ల మేరకు వ్యయాలను తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని పరిశ్రమ వర్గాల విశ్లేషణ.
  • పర్సనల్‌ కంప్యూటర్లు, ప్రింటర్లు సరఫరా చేసే సంస్థ అయిన హెచ్‌పీ ‘వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ’లో భాగంగా వచ్చే మూడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేల నుంచి తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో మనదేశంలో 500 ఉద్యోగాలు ఉంటాయని అంచనా.
  • యూఎస్‌కు చెందిన ‘వుయ్‌వర్క్‌‘ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 4,000 మందిని తొలగించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్‌ మార్సెలో క్లారీ తాజాగా ఉద్యోగులకు రాసిన లేఖలో సూచనప్రాయంగా చెప్పారు. ఇందులో మనదేశంలో పనిచేస్తున్న ఆ కంపెనీ సిబ్బంది ఉంటారనేది విస్పష్టం. హైదరాబాద్‌తో సహా ముంబయి, బెంగళూరు, నోయిడా, గురుగ్రామ్‌, పుణె నగరాల్లో ‘వుయ్‌వర్క్‌’ కార్యకలాపాలు సాగిస్తోంది.
  • జొమాటో రెండు నెలల క్రితం గురుగ్రామ్‌లోని తన కేంద్ర కార్యాలయంలో 550 మంది ఉద్యోగులను తొలగించింది. ఆటోమేషన్‌ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో సామర్థ్యాన్ని పెంచుకుంటున్నందున ఉద్యోగుల సంఖ్య తగ్గింపు తప్పనిసరి అవుతోందని ఈ సందర్భంగా జొమాటో వివరించింది.

ఎందుకు ఇలా?

ఐటీ రంగంలో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయంలో సంబంధిత వర్గాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఐటీ కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరిగిపోతోంది. అందువల్ల వ్యయాలు తగ్గించుకోవటం తప్పనిసరిగా మారింది. అందువల్ల పెద్ద సంఖ్యలో బెంచ్‌ సిబ్బందిని, ప్రాజెక్టులు లేని విభాగాల్లో సిబ్బందిని కొనసాగించటానికి ఇష్టపడటం లేదు. ఇంక్రిమెంట్లు తగ్గించటం లేదా వాయిదా వేయటానికి కొన్ని సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఉద్యోగుల సంఖ్య తగ్గించుకుంటున్నాయి. మనదేశంలో ఐటీ పరిశ్రమ దాదాపు మూడు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోంది. 90వ దశకంలో ప్రారంభమైన ఎన్నో కంపెనీలు భారీగా విస్తరించి స్థిరీకరణ సాధించాయి. ఒక స్థాయికి చేరిన తర్వాత మధ్యస్థాయిలో పర్యవేక్షణ బాధ్యతల్లో ఉండే సీనియర్‌ ఉద్యోగుల అవసరం అంతగా ఉండదు. అందువల్ల పలు ఐటీ కంపెనీలు అటువంటి ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు మోహన్‌ దాస్‌ పాయ్‌ పేర్కొన్నారు.

ఇక సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా వస్తున్న మార్పులు కూడా ఉద్యోగుల తొలగింపునకు కారణమవుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్‌, మెషీన్‌ లెర్నింగ్‌, 5జీ... వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వస్తున్న ఫలితంగా పలు సంస్థల్లో గతంలో మాదిరిగా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అవసరం ఉండటం లేదు. సాంకేతికంగా వస్తున్న మార్పుల వల్ల కొత్తరకం ఉద్యోగాలు లభిస్తాయి. అదే సమయంలో పాత ఉద్యోగుల అవసరం అంతగా ఉండదు. అందుకే తొలగింపు అనివార్యం అవుతోంది అని స్థానిక ఐటీ వర్గాలు వివరిస్తున్నాయి.

నైపుణ్యాలు పెంచుకోవటమే మార్గం

ఐటీ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా సరికొత్త నైపుణ్యాలు సమకూర్చుకున్న విద్యార్ధులకైనా, ఐటీ ఉద్యోగులకైనా ఉద్యోగాల కొరత లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానానికి, సేవలకు ఎంతో గిరాకీ లభిస్తోంది, ఈ విభాగంలో మనదేశంలోనే సమీప భవిష్యత్తులో ఒక లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, అటువంటి నైపుణ్యాలు ఉన్నవారికి ఎన్నో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి అని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నైపుణ్యాలు పెంచుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా తయారయితే సరే, కానీ వెనుకబడిన వారిని ‘తొలగింపు’ భయం వెంటాడుతోందని తెలుస్తోంది. ఈ పరిస్థితులకు తగ్గట్లుగా నిపుణులను సన్నద్ధం చేసేందుకు విద్యా సంస్థలు, ఐటీ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఇదీ చూడండి: మార్కెట్ల​ కొత్త రికార్డ్​.. జీవనకాల గరిష్ఠానికి సెన్సెక్స్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ
SHOTLIST:
@CBCJ - AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ
Tokyo - 25 November 2019
1. Pope Francis arriving at Tokyo Cathedral
2. Pope Francis blessing priests and Tokyo Cathedral
3. Wide of Pope Francis sitting by the altar
4. Pope Francis greeting and gifting a young woman
5. SOUNDBITE (Spanish) Pope Francis:
"When I look at it I can see the cultural and religious diversity of young people living in Japan today and also some of the beauty that your generation offers to the future. The friendship between you, your presence here, reminds everyone that the future is not monochrome."
6. Pan of youth congregation
7. SOUNDBITE (Spanish) Pope Francis:
"And if we are honest, we realise that the greatest poverty we can have is loneliness and the feeling of not being loved."
8. Zoom out of youth congregation
9. SOUNDBITE (Spanish) Pope Francis:
"Once again I would like to tell you that to grow, to discover our own identity, our own goodness, our own inner beauty, we can't look in the mirror. Many things have been invented, but thank God there are no selfies of the soul."
10. Youth congregation applauding
11. Youth representatives offering a kimono with a cartoon of Pope Francis to the pope and him trying it on
12. Various of Pope Francis greeting congregation and leaving
STORYLINE:
Pope Francis held a meeting in Tokyo Cathedral on Monday with hundreds of young people in attendance.
During the assembly, the Pope met young victims of bullying and social exclusion.
He celebrated the fact that by looking at the younger generation of Japan he could see that the "future is not monochrome."
Pope Francis recalled the young congregation that to know themselves they had to look beyond a mirror and that "there are no selfies of the soul."
The assembly came after the Pope met with victims of Japan’s 2011 nuclear disaster and called for the world to rethink its reliance on nuclear power.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.