ETV Bharat / business

సుందర్​కు పదోన్నతి- ఆల్ఫాబెట్​ సీఈఓగా బాధ్యతలు - ఆల్ఫాబెట్​ సీఈఓగా సుందర్​పిచాయ్​కు పదోన్నతి

భారతీయ అమెరికన్​ సుందర్ ​పిచాయ్​ గూగుల్​ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గూగుల్ సహవ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్​లు తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. తాజా పదోన్నతితో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు పిచాయ్​.

Sundar Pichai promoted as Alphabet CEO
సుందర్​కు పదోన్నతి- ఆల్ఫాబెట్​ సీఈఓగా బాధ్యతలు
author img

By

Published : Dec 5, 2019, 11:20 AM IST

గూగుల్​ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ సీఈఓగా భారతీయ-అమెరికన్​ సుందర్​ పిచాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. గూగుల్ సహవ్యవస్థాపకులు లారీ పేజ్​, సెర్గీ బ్రిన్.. ​ఆల్ఫాబెట్​ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం గూగుల్ సీఈఓగా ఉన్న సుందర్​ పిచాయ్ తాజా పదోన్నతితో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు.

పదవీ విరమణ...

లారీ పేజ్​, సెర్గీ బ్రిన్.. తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు కంపెనీ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. ప్రస్తుతం ఆల్ఫాబెట్​ స్థిరపడిందని, గూగుల్ ఇతర అనుబంధ సంస్థలు స్వతంత్రంగా, సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో సంస్థను సమర్థవంతంగా నడిపే ఇతర మార్గాలు ఉన్నప్పుడు తాము ఇదే పదవుల్లో కొనసాగలేమని స్పష్టం చేశారు.

"ఆల్ఫాబెట్, గూగుల్​లకు ఇకపై ఇద్దరు సీఈఓలు, ప్రెసిడెంట్ ఉండనవసరం లేదు. ఇకపై రెండింటికీ సుందర్​ పిచాయ్​ మాత్రమే సీఈఓగా ఉంటారు. గూగుల్​ కార్యనిర్వహక బాధ్యతలు నిర్వహిస్తారు. సంస్థ తరఫున జవాబుదారీగా ఉంటారు." - లారీ పేజ్​, సెర్గీ బ్రిన్​, గూగుల్ సహవ్యవస్థాపకులు.

గూగుల్ సీఈఓగా, ఆల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్​ సభ్యునిగా సుందర్​ పిచాయ్​ 15 సంవత్సరాలు తమతో కలిసి పనిచేశారని లారీ పేజ్​, సెర్గీ బ్రిన్ తెలిపారు. పిచాయ్​.. ఆల్ఫాబెట్ నిర్మాణ విలువపై తమ విశ్వాసాన్ని నిలుపుతారని వారు అభిప్రాయపడ్డారు.

మరింత కృషి చేస్తా

ఆల్ఫాబెట్ సీఈఓ మార్పు... సంస్థ నిర్మాణాన్ని, రోజువారీ పనిని ఏమాత్రం ప్రభావితం చేయదని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.

"నేను గూగుల్​పై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తాను. కంప్యూటింగ్ సరిహద్దులను మరింతగా విస్తరించడానికి, ప్రతి ఒక్కరికీ సహాయకరంగా ఉండేలా గూగుల్​ను రూపొందించడానికి కృషి చేస్తాను. అదే సమయంలో.. నేను ఆల్ఫాబెట్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. దీర్ఘకాలిక దృష్టితో నూతన సాంకేతికతల ద్వారా పెద్ద సవాళ్లను సైతం ఎదుర్కొనేందుకు సంస్థ కృషి చేస్తుంది." - సుందర్ పిచాయ్​, గూగుల్​ సీఈఓ.

ఇదీ చూడండి: రూపుమారిన మహారాష్ట్ర రాజకీయం

AP Video Delivery Log - 0200 GMT News
Wednesday, 4 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0133: Lebanon Clashes AP Clients Only 4243011
Police in Lebanon use tear gas to disperse protesters
AP-APTN-0133: Lebanon Protest AP Clients Only 4243007
Protests as Lebanon’s PM backs businessman to replace him
AP-APTN-0128: SKorea NKorea Lost Children AP Clients Only 4243010
NKorean-Chinese children struggle in SKorea
AP-APTN-0039: US Impeachment GOP AP Clients Only 4243009
GOP: Impeachment doesn't meet criteria to go forth
AP-APTN-0015: Venezuela Colombia TIAR AP Clients Only 4243006
Rio Treaty nations move to further isolate Venezuela
AP-APTN-0011: US CA Elon Musk Court KTTV Must credit KTTV Fox 11 News; No access Los Angeles, No use US broadcast networks, No re-sale, re-use or archive 4243005
Tesla CEO Elon Musk in court for defamation suit
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.