ETV Bharat / business

రిలయన్స్​ రిటైల్​లో కేకేఆర్​ భారీగా పెట్టుబడులు - రిలయన్స్ రిటైల్​

రిలయన్స్​ రిటైల్​లో మరో అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రిటైల్​ వ్యాపారాల్లో ప్రముఖ సంస్థ కేకేఆర్​ రూ.5,550 కోట్లతో 1.28 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్​ ప్రకటించింది.

BIZ-KKR-RELIANCE RETAIL
రిలయన్స్
author img

By

Published : Sep 23, 2020, 10:14 AM IST

రిలయన్స్​ రిటైల్​లో అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ కేకేఆర్​ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. రిలయన్స్​ రిటైల్​ వెంచర్స్​ లిమిటెడ్​ (ఆర్​ఆర్​వీఎల్​)లో రూ.5,550 కోట్లతో 1.28 శాతం వాటాను కొనుగోలు చేయనుందని రిలయన్స్​ ఇండస్ట్రీస్ వెల్లడించింది.

రిలయన్స్​ సంస్థలో కేకేఆర్​ వాటా కొనుగోలు చేయటం ఇది రెండోసారి. ఇప్పటికే రిలయన్స్ జియోలో రూ.11,367 కోట్లు పెట్టుబడులు పెట్టింది. అంతర్జాతీయ వేదికలో కేకేఆర్​తో కలిసి పనిచేయటం సంతోషంగా ఉందని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వెల్లడించారు.

జియో తర్వాత రిటైల్​ వ్యాపారంలో పెట్టుబడులపై రిలయన్స్ దృష్టి సారించింది. ఇప్పటికే సిల్వర్ లేక్ సంస్థ రిలయన్స్ రిటైల్ వ్యాపారాల్లో రూ.7.5వేల కోట్ల పెట్టుబడితో 1.75 శాతం వాటాను దక్కించుకుంది. దీనితో పాటు రిలయన్స్​, ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మధ్య 20 బిలియన్ డాలర్ల డీల్​కు ఇరు సంస్థలు చర్చిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇదీ చూడండి: రిలయన్స్ రిటైల్​లోకి మరో భారీ పెట్టుబడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.