4జీ మొబైల్ ఫోన్లు, ఇతర డివైజ్ల ధరలు తగ్గేందుకు.. రియల్మీ సహా ఇతర కంపెనీలతో కలిసి పని చేస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. దిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ)లో ఈ విషయం వెల్లడించింది.
'ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా మంది ఇంకా 2జీ ఫోన్లే వాడుతున్నారు. వారంతా 4జీ, 5జీ ఫోన్లు, ఇతర డివైజ్లు వాడేందుకు.. తక్కువ ధరలో వాటిని అందించాల్సిన అవసరం ఉంది. అందుకే రియల్మీ, సహా ఇతర కంపెనీలతో కలిసి పని చేస్తున్నాం.' అని జియో పేర్కొంది.
5జీతో ఆవిష్కరణలకు భారీ అవకాశాలు..
5జీ రాకతో భవిష్యత్లో కొత్త అవిష్కరణలకు భారీగా అవకాశాలు లభిస్తాయని రియల్మీ ఇండియా సీఈఓ మాధవ్ సేఠ్ అన్నారు. ఇది స్మార్ట్ఫోన్లకు మాత్రమే పరిమితం కాదని తెలిపారు. భారీ సంఖ్యలో 5జీ ఫోన్లను తీసుకువచ్చేందుకు చిప్సెట్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి:'2050 నాటికి 28 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థ'