ETV Bharat / business

హిందుజా ఆసక్తితో దూసుకెళ్తున్న జెట్​ షేర్లు

author img

By

Published : May 22, 2019, 3:13 PM IST

జెట్ ఎయిర్​వేస్​పై హిందుజా గ్రూపు ఆసక్తి చూపుతున్న కారణంగా జెట్​ షేర్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నేటి మిడ్ సెషన్​లో ఏకంగా 8.59 శాతం వృద్ధి చెందాయి.

జెట్ ఎయిర్​వేస్​

రుణ సంక్షోభంలో చిక్కున్న జెట్ ఎయిర్​వేస్​ షేర్లు నేటి ట్రేడింగ్​లో భారీగా పుంజుకున్నాయి. దిగ్గజ వాహన తయారీ సంస్థ హిందుజా గ్రూపు జెట్​లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా మూడో రోజు జెట్​​ షేర్లు మెరుస్తున్నాయి.

బీఎస్​ఈలో జెట్ షేరు ప్రస్తుతం 8.59 శాతం వృద్ధితో రూ.163.70 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్​ఈలో 8.61 శాతం పెరిగిన షేరు ధర ప్రస్తుతం రూ.163.85 వద్ద కొనసాగుతోంది.

నిధుల కొరత కారణంగా ఏప్రిల్ 17 నుంచి సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది జెట్​. సంస్థపై మొత్తం రూ.8వేలకోట్లకు పైగా రుణభారం ఉంది.

ఇదీ చూడండీ: భారత్​లో త్వరలో 'టెస్లా' శకారంభం!

Darbhanga (Bihar), May 21 (ANI): Police and security guards baton charged on members of ABVP who were staging a demonstration today in support of the president of Students Union of Lalit Narayan Mithila University in Bihar's Darbhanga.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.