ETV Bharat / business

జెఫ్​ బెజోస్​ దూకుడు.. రికార్డ్​ స్థాయికి సంపద - జెఫ్​ బెజోస్ విడాకుల విలువ

ప్రపంచ అపరకుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ సంపద రికార్డు స్థాయిని తాకింది. అమెరికా మార్కెట్లలో అమెజాన్ షేర్లు బుధవారం భారీగా పుంజుకోవడమే ఇందుకు కారణం. కరోనా వల్ల ప్రపంచమంతా సంక్షోభం నెలకొన్నా.. ఈ స్థాయిలో బెజోస్​ సంపద పెరగటం గమనార్హం.

jeff bezoss wealth new record
రికార్డు స్థాయికి జెఫ్​ బెజోస్ సంపద
author img

By

Published : Jul 2, 2020, 12:40 PM IST

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ సంపద భారీగా పెరిగింది. మొత్తం సంపద గతంలో ఉన్న రికార్డులను చెరిపేస్తూ సరికొత్త గరిష్ఠానికి చేరింది.

ఖరీదైన విడాకులు..

జెఫ్​ బెజోస్​ గత ఏడాది ఆయన భార్య మెకాంజీతో విడాకులు తీసుకున్నారు. ఇందుకు గాను.. భరణం కింద దాదాపు 38 బిలియన్ డాలర్లు (2 లక్షల కోట్ల పైమాటే) చెల్లించారు. దీనితో వీరి విడాకులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. విడాకుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న మహిళల్లో మెకాంజీ 4వ స్థానానికి చేరారు. ఇప్పుడామె ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకారు.

bezos with his ex wife
మాజీ భార్య మెకాంజీతో బెజోస్​

రికార్డు స్థాయి..

అమెరికా మార్కెట్లలో అమెజాన్ షేర్లు బుధవారం దాదాపు 4.4 శాతం పెరిగాయి. దీనితో ఆయన​ సంపద కూడా భారీగా వృద్ధి చెంది రికార్డు స్థాయికి చేరింది.

బ్లూమ్​బర్గ్​ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జెఫ్​ బెజోస్​ సంపద ప్రస్తుతం రూ.171.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇంతకు ముందు 2018 సెప్టెంబర్​ 4న బెజోస్​ సంపద 167.7 వద్ద రికార్డు స్థాయిని తాకింది.

56.7 బిలయన్ డాలర్ల సంపద..

కరోనా, ఆర్థిక మాంద్యం పరిస్థితులతో ప్రపంచం తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ.. అమెజాన్ ఈ ఏడాది ఇప్పటి వరకు 56.7 బిలియన్​ డాలర్లను గడించింది.

ఉద్యోగులకు బోనస్​..

ఈ స్థాయిలో సంపద వృద్ధి చెందిన కారణంగా అమెజాన్ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్​ ప్రకటించింది. కరోనా సంక్షోభంలోనూ పనిచేస్తున్న ఉద్యోగులకు 500 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3,775 కోట్లు) బోనస్​ ప్రకటించింది. జూన్‌ వరకు పనిచేసిన ఉద్యోగులు, భాగస్వాములు ఒక్కొక్కరు 150 డాలర్ల (రూ11,300) నుంచి 3,000 డాలర్ల (రూ.2.26 లక్షలు) ఏకకాల బోనస్‌ అందుకుంటారని వెల్లడించింది.

ఇదీ చూడండి:అయితే ఏంటి? చేరకపోతే ఉద్యోగాలు పోతాయ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.