ETV Bharat / business

స్మార్ట్​ఫోన్ మార్కెట్​లో 76 శాతం వాటా చైనా కంపెనీలదే! - భారత్​లో శాంసంగ్​ మార్కెట్ వాటా

కరోనా సంక్షోభం నుంచి దేశీయ స్మార్ట్​ఫోన్ విపణి తేరుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో 5 కోట్ల స్మార్ట్​ఫోన్​ షిప్మెంట్లు నమోదైనట్లు కెనాలిస్ సంస్థ నివేదికలో వెల్లడైంది. గత ఏడాది ఇదే సమయంలో.. భారత స్మార్ట్​ఫోన్ మార్కెట్​లో చైనా కంపెనీల వాటా 74 శాతం కాగా.. ఈసారి అది 76 శాతానికి పెరిగినట్లు ఈ నివేదిక వివరించింది.

CHINA COMPANIES SHARE RISE IN SMARTOHONE MAREKET
భారత్ స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో పెరిగిన చైనా కంపెనీల వాటా
author img

By

Published : Oct 22, 2020, 5:23 PM IST

దేశీయ స్మార్ట్​ఫోన్ మార్కెట్ కొవిడ్ సంక్షోభం తర్వాత తిరిగి భారీగా పుంజుకుంది. సెప్టెంబర్​తో ముగిసే త్రైమాసికంలో స్మార్ట్​ఫోన్ల షిప్మెంట్​లు జీవన కాల గరిష్ఠం వద్ద 5 కోట్లకు పెరిగాయని రిసెర్చ్ సంస్థ కెనాలీస్ నివేదిక తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 4.2 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది.

ఇదే సమయంలో దేశ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో చైనా కంపెనీల వాటా 76 శాతానికి చేరినట్లు కెనాలీస్ సర్వే పేర్కొంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో టాప్ 5 కంపెనీలైన షియోమీ, శాంసంగ్, వీవో, రియల్​మీ, ఒప్పోల షిప్మెంట్​లు భారీగా పెరిగినట్లు సర్వేలో తేలింది.

మార్కెట్ లీడర్​గా షియోమీ..

2020 క్యూ3లో 26.1 శాతం మార్కెట్ వాటా (13.1 మిలియన్​ యూనిట్లు)తో షియోమీ మార్కెట్ లీడర్​గా నిలిచింది.

దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ 20.4 శాతం మార్కెట్ వాటా(10.2 మిలియన్ యూనట్లు)తో.. వీవోను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది.

17.6 శాతం (8.8 మిలియన్ యూనిట్లు) మార్కెట్ వాటాతో వివో, 17.4 శాతం (8.7 మిలియన్ యూనిట్లు) వాటాతో రియల్​మీ, 12.1 శాతం (6.1 మిలియన్ యూనిట్లు) వాటాతో ఒప్పోలు వరుసగా 3,4,5 స్థానాల్లో ఉన్నాయి.

లగ్జరీ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్​కూ.. మూడో త్రైమాసికం కలిసొచ్చింది. గత ఏడాది ఇదే సమయంలో పోలిస్తే దాదాపు రెండంకెల వృద్ధితో 8 లక్షల యూనిట్లు షిప్మెంట్​లు నమోదయ్యాయి.

గత ఏడాది సెప్టెంబర్​తో త్రైమాసికంతో పోలిస్తే.. 2020 క్యూ3లో దేశ స్మార్ట్​ఫోన్ మార్కెట్​లో చైనా కంపెనీల వాటా 74 శాతం నుంచి 76 శాతానికి పెరిగింది. అయితే ఇది జూన్​ త్రైమాసికంతో నమోదైన 80 శాతం మార్కెట్ వాటా కన్నా తక్కువగా ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి:డాక్టర్‌ రెడ్డీస్‌ ఐటీ విభాగాలపై సైబర్‌ దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.