ETV Bharat / business

డిజిటల్​ భారత్​: ఆన్​లైన్​ బాటలో పరుగులు - అమెజాన్​

ప్రస్తుతం ప్రతి అవసరానికి అంతర్జాల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఆన్​లైన్​ వీడియో కంటెంట్, అన్​లైన్ ఫుడ్​ డెలివరి, క్యాబ్​ సర్వీసులు... ఇలా అన్నింటా భారత్​ డిజిటల్​మయం అవుతున్నట్లు జర్మనీకి చెందిన ఓ సంస్థ అధ్యయనంలో తేలింది.

డిజిటల్​ భారత్
author img

By

Published : May 19, 2019, 3:31 PM IST

ఒకప్పుడు వినోదం అంటే సినిమా థియేటర్లు మాత్రమే. ఆ తర్వాత కేబుల్​ టీవీ. ఇప్పుడు అమెజాన్​ ప్రైమ్​, నెట్​ఫ్లిక్స్​, హాట్​స్టార్​ ఇలా ఎన్నో. ఇప్పుడున్న వినియోగదారులు కేబుల్​ టీవీ కన్నా హాట్​స్టార్​ లాంటి వీడియో-ఆన్​-డిమాండ్​ సేవలు అందించే యాప్​లవైపే అధికంగా ఆసక్తి చూపుతున్నట్లు జర్మన్ రీసెర్చ్ సంస్థ 'స్టాటిస్టా' ఇటీవలి నివేదికలో తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం ఆన్​లైన్​ కంటెంట్​కోసం అధికంగా వెచ్చిస్తున్న దేశాల్లో 52 శాతం వాటాతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఈ వరుసలో చైనా, బ్రెజిల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మ్యూజిక్ సేవల విభాగంలో అమెజాన్ తొలి స్థానంలో ఉన్నట్లు స్టాటిస్టా పేర్కొంది.

జియో రాకతోనే...

JIO
జియో

భారత్​లో వీడియో స్ట్రీమింగ్ ఇంతలా పెరిగేందుకు రిలయన్స్ జియో ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. జియో ఉచిత డాటాతో సృష్టించిన ప్రభంజనంతో గ్రామాల్లోనూ వీడియోలు​ చూసే అలవాటు గణణీయంగా పెరిగిందని వివరించింది స్టాటిస్టా.

దేశంలోని 40శాతం గ్రామాలకే అంతర్జాల​ సదుపాయం ఉంది. అయితే వీడియో స్ట్రీమింగ్​లో 65 శాతం వినియోగం గ్రామాల్లోనే జరుగుతుండటం విశేషం.

కేబుల్ టీవీలకు ప్రమాదంగా...

నెట్​ ఫ్లిక్స్​, అమెజాన్ ప్రైమ్​ సహా హాట్ స్టార్​ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో వీడియో వీక్షణ భారీగా పెరిగింది. వీటి వల్ల కేబుల్​ టీవీ సంస్థలకు ముప్పు ఉందని నివేదిక పేర్కొంది.

CABLE TV
కేబుల్ టీవీ

35 వేల కోట్లకు వీడియో స్ట్రీమింగ్​ మార్కెట్!

ప్రస్తుతం దేశంలో 32కు పైగా ఆన్​లైన్​ కంటెంట్​, వీడియో స్ట్రీమింగ్​ సంస్థలు ఉన్నాయి. 2023 నాటికి వీటి మార్కెట్​ విలువ దాదాపు 35,000 కోట్లు (5 బిలియన్​ డాలర్లు)కు చేరొచ్చని బోస్టన్​ కన్సల్టింగ్ గ్రూపు అంచనా వేసింది.

ఆన్​లైన్​ ఫుడ్​పై యువత మోజు

ONLINE FOOD
ఆన్​లైన్​ ఫుడ్

దేశంలో అన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సేవలు వినియోగిస్తున్న వారిలో యువతదే ప్రధాన స్థానం. అన్​లైన్​ ఫుడ్ డెలివరి మార్కెట్ విలువ ఏటా 16 శాతం వృద్ధి చెందుతోంది. ఈ లెక్కన 2023 నాటికి 17 బిలియన్ డాలర్లకు మార్కెట్ విలువ చేరొచ్చని స్టాటిస్టా అంచనా.

ఓలా, ఉబర్ రయ్​.. రయ్​..

OLA
ఓలా,

క్యాబ్​ సేవలందించే ఓలా, ఉబర్​ వంటి సంస్థలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దక్షిణాసియా టెక్-అంకురాలు అంతర్జాతీయంగా పోటీకి సిద్ధమవుతున్నాయంటూ నివేదికలో ఓలాను ప్రస్తావించింది స్టాటిస్టా.

ఇదీ చూడండి:విమాన టికెట్లపై 'అమెజాన్'​ బంపర్​ ఆఫర్​

AP Video Delivery Log - 0800 GMT News
Sunday, 19 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0700: Australia Election Reaction No access Australia 4211566
Politicians react to surprise Morrison election victory
AP-APTN-0657: India Elections AP Clients Only 4211559
Voting in seventh phase of Indian elections
AP-APTN-0657: Saudi Arabia Iran No access Saudi Arabia 4211565
Saudi FM: Kingdom not seeking war in region
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.