ETV Bharat / business

అలీబాబా 'జాక్​ మా'కు భారతీయ కోర్టు సమన్లు

చైనా వ్యాపార దిగ్గజం, అలీబాబా సంస్థ సహ వ్యవస్థాపకుడు 'జాక్​ మా'కు ఓ భారతీయ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు.. అన్యాయంగా తనను ఉద్యోగం నుంచి తప్పించారని కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జాక్​ మా సహా 12 మంది ఉన్నతాధికారులకు నోటిసులు పంపింది న్యాయస్థానం.

Indian court summons Jack Ma
జాక్​మాకు కోర్టు సమన్లు
author img

By

Published : Jul 26, 2020, 5:49 PM IST

చైనీస్‌ ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు, కంపెనీ ఛైర్మన్‌ 'జాక్‌ మా'కు గురుగ్రామ్ కోర్టు సమన్లు జారీ చేసింది. తప్పుడు కారణాలతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని అలీబాబా గ్రూప్​ సంస్థ భారతీయ మాజీ ఉద్యోగి చేసిన ఫిర్యాదు మేరకు సమన్లు పంపింది కోర్టు.

ఫిర్యాదు ఇదీ..

కంపెనీ యాప్​లైన యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్ల సెన్సార్​షిప్​, ఫేక్​ న్యూస్​ల విషయంపై తాను అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే.. తనను కంపెనీ నుంచి తప్పించినట్లు సంస్థ మాజీ ఉద్యోగి పుష్పేంద్ర సింగ్ పర్మార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

చైనాకు ప్రతికూలంగా వచ్చే వార్తలను యూసీ వెబ్​ సెన్సార్ చేసేదని, వాటిని రాజకీయ గందరగోళానికి కారణమయ్యేలా చూపించేదని ఫిర్యాదులో తెలిపారు పర్మార్. వాటి గురించి తాను ప్రశ్నించడం వల్లే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో 57 చైనా యాప్​లపై.. గత నెల నిషేధం విధించింది భారత్. ఇందులో యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్​ కూడా ఉన్నాయి. చైనా యాప్​లపై నిషేధం విధించిన కొన్ని వారాల్లోనే ఈ విషయం బయటకు రావడం గమనార్హం.

జాక్​ మా సహా 12 మంది సంస్థ ఉన్నతాధికారులు.. జులై 29న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. 30 రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని తెలిపింది. జాక్​ మా తరఫున స్పందించేందుకు అలీబాబా గ్రూప్ నిరాకరించింది. కంపెనీ భారత విభాగం మాత్రం ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, స్థానిక నిబంధనలను పాటిస్తున్నామని పేర్కొంది.

పుష్పేంద్ర సింగ్ డిమాండ్..

పుష్పేంద్ర సింగ్ పర్మార్ యూసీ వెబ్​ విభాగంలో ఆసోసియేట్ డైరెక్టర్​గా పని చేశారు. 2017 అక్టోబర్ 17 వరకు ఆ పదనిలో ఉన్నారు పర్మాన్​. తప్పుడు కారణాలతో తనను బాధ్యతల నుంచి తప్పించినందుకు కంపెనీ తనకు రూ.2 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాలని పుష్పేంద్ర సింగ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి:అంకురం... దిశ మారింది, దశ తిరిగింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.