కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త వీ.జీ.సిద్ధార్థ అనుహ్య మృతి పట్ల దేశ పారిశ్రామిక రంగ దిగ్గజాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి సిద్ధార్థ చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. వ్యాపార సమస్యలు వారి జీవితం మీద ప్రభావం పడకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు.
సోమవారం నుంచి కనిపించకుండా పోయిన వీజీ సిద్ధార్థ... దక్షిణ కన్నడ జిల్లాలోని నేత్రావతి నదిలో బుధవారం ఉదయం విగతజీవిగా లభ్యమయ్యారు.
ఆయన మృతికి పలువురు పారిశ్రామికవేత్తలు నివాళులర్పించారు.
"ఆదర్శవంతమైన పారిశ్రామికవేత్త. నాకు సిద్ధార్థ వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ఎనర్జీ, సానుకూల దృక్పథం చూస్తే ఆశ్చర్యమేసేది."- సచిన్ బన్సల్, ఫ్లిప్కార్ట్ సహస్థాపకుడు
"సిద్ధార్థ గురించి గానీ.. ఆయన ఆర్థిక పరిస్థితుల గురించి గానీ నాకు పెద్దగా తెలియదు. నాకు తెలిసిందల్లా పారిశ్రామికవేత్తలు వ్యాపారాల్లో వైఫల్యాల కారణంగా వారి ఆత్మాభిమానం పొగొట్టుకోకూడదు. అది ఒక సంస్థ పతనానికి కారణమవుతుంది." - ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూపు ఛైర్మన్
"వి.జీ సిద్ధార్థ భార్య, పిల్లలకు, ఎస్ఎం కృష్ణ, కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. సిద్ధార్థ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా." - కిరణ్ మజుందర్ షా, బయోకాన్ సీఎండీ
"ఈ బాధను నేను మాటల్లో చెప్పలేకపోతున్నా." - విజయ్ శంకర్ శర్మ, పేటీఎం వ్యవస్థాపకుడు
ఇదీ చూడండి: నన్నూ సిద్ధార్థలాగే వేధిస్తున్నారు: విజయ్ మాల్యా