2017 లో టెస్లాను అతితక్కువ ధరకే యాపిల్ కు విక్రయించాలనుకున్నట్లు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. ఇప్పడున్న ధరలో పదో వంతుకే అమ్మాలనుకున్నట్లు పేర్కొన్నారు. టెస్లా మోడల్3 తయారీ సమయంలో కంపెనీ తీవ్ర కష్టాల్లో ఉండడమే కారణమని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ విషయమై యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ తో చర్చించానుకున్నానని అన్నారు . అయితే టిమ్‌కుక్ అందకు ఒప్పుకోలేదన్నారు.
2017లో టెస్లా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఒక దశలో దివాలా దశకు చేరింది. నాటి నుంచి టెస్లా షేరు విలువ దాదాపు 1400 శాతం పెరిగింది. టెస్లా కూడా యాపిల్‌తోపాటు ఎస్‌అండ్‌పీ 500 సూచీలో స్థానం దక్కించుకొన్న మర్నాడే మస్క్ నుంచి ఈ ట్వీట్ రావడం విశేషం.
వాస్తవానికి అప్పట్లో టెస్లావిలువ 100 బిలియన్ డాలర్ల లోపుగానే ఉంది. యాపిల్ కూడా 2014 నుంచి ప్రాజెక్టు టైటాన్ పేరుతో కారును అభివృద్ధి చేస్తోంది. 2018 నాటికి యాపిల్ 45 అటానమస్ కార్లను తయారు చేసినట్లు కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్ పేర్కొంది.
ఇదీ చూడండి: కరోనా భయంతో... గణనీయంగా పెరిగిన కార్ల విక్రయాలు