ETV Bharat / offbeat

న్యూ ఇయర్ రిజల్యూషన్స్ సక్సెస్ అవ్వాలంటే - ఇప్పటి నుంచే ఈ టిప్స్ పాటించాలట! - BEST IDEAS FOR NEW YEAR RESOLUTION

కొత్త ఏడాదిలో అనుకునే లక్ష్యాలు సాధించాలంటే - ఈ రోజు నుంచే ఇలా చేయాలంటున్న నిపుణులు!

Best Ideas for New Year Resolution
NEW YEAR RESOLUTION TIPS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2024, 11:58 AM IST

Best Ideas for New Year Resolution : న్యూ ఇయర్ ప్రారంభం అవుతోంది అనగానే ప్రతి ఒక్కరిలో కొత్త ఆలోచనలు, కొంగొత్త ఆకాంక్షలు మెదులుతుంటాయి. ఇబ్బంది పెడుతున్న పాత అలవాట్లను వదిలించుకోవాలని భావించేవారు కొందరైతే, కొత్త విధానాలను అవలంబించాలని నిర్ణయించుకునేవారు ఇంకొందరు. సాదాసీదాగా సాగిపోతున్న జీవితంలో ఈ న్యూ ఇయర్ నుంచైనా కాస్త జోష్ నింపాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది రకరకాల రిజల్యూషన్స్​ పెట్టుకుంటారు. కొత్త ఏడాది నుంచి వాటికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంటారు.

ఈ క్రమంలోనే న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే పేరుకి అన్నీ మొదలుపెడతారు. తీరా రెండ్రోజులకే వాటిని పక్కన పెడుతుంటారు. కాబట్టి, మీరూ న్యూ ఇయర్ రిజల్యూషన్​గా ఏదైనా అనుకుంటే దాన్ని ప్రారంభించడం కోసం జనవరి దాకా వెయిట్ చేయకుండా ఈరోజు నుంచే ఆచరణలో పెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. ఫలితంగా మీరు తీసుకున్న నిర్ణయాలు మధ్యలోనే ఆగిపోకుండా, ఏడాదంతా సానుకూల దృక్పథంతో, సంతోషంగా ముందుకు సాగుతాయంటున్నారు. అంతేకాదు, అవి మీ ఆనందాలను రెట్టింపు చేస్తాయంటున్నారు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్​లో డైలీ వ్యాయామం అనేది ఉంటుంది. మీ లిస్ట్​లో కూడా అది ఉంటే ఇప్పట్నుంచే రోజూ ఓ పావుగంట చేయండి. తక్కువ సమయమే కాబట్టి, సరదాగా ఉంటుంది. మన గోల్‌ జనవరి కదా! మధ్యలో ఆపాలి అనిపించదు. అలా చేస్తూ చేస్తూ తెలియకుండానే అలవాటుగా మారిపోతుందంటున్నారు నిపుణులు. కొత్త సంవత్సరంలో కొనసాగించేస్తాం. అనుకున్నది చేస్తున్నామన్న సంతృప్తి కలుగుతుందంటున్నారు.

న్యూ ఇయర్ తీర్మానంగా జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకు బదులుగా ఆరోగ్యకరమైనవే తినాలన్నది లక్ష్యమనుకుందాం. అయితే, కొత్త సంవత్సరం చికెన్‌ వద్దు, ఆయిల్ వద్దు, కూరగాయలు పండ్లే తినాలి అనుకుంటూ వెళితే నోరు చప్పబడిపోదూ? ఇంకేం కొనసాగిస్తాం? అందుకే ఈ టైమ్​లో రుచిగా ఆరోగ్యంగా చేసుకునే రెసిపీలు సెర్చ్​ చేయండి. ఒక్కొక్కటీ నెమ్మదిగా ప్రయత్నిస్తూ వెళ్లండి. అప్పుడు కఠినంగా అనిపించకపోవడమే కాకుండా నోటికి రుచికరమైనవి తింటున్నామనే ఫీలింగ్ కలుగుతుందంటున్నారు నిపుణులు.

అంతా రేపటి కోసమే - మరి మీరు రాబోయే కొత్త ఏడాదికి ప్లాన్స్​ చేసుకున్నారా?

కొత్త ఏడాది మాట దేవుడెరుగు కానీ ఎంత ఒత్తిడండి? ‘న్యూ ఇయర్‌- న్యూ మీ’ అంటూ వాళ్లవి ట్రై చేస్తున్నారు, వీళ్లివి చేస్తున్నారు అని తెగ కంగారుపడతాం. మనమూ గబగబా ఓ లిస్ట్ రెడీ చేస్తాం. తీరా అవన్నీ చేయలేక ఇంకో ఇబ్బంది. అందుకే, అదే ముందే మొదలుపెట్టాం అనుకోండి. ఒక్కోటిగా ప్రయత్నించొచ్చు. అప్పుడు మధ్యలో ఆపేశామనే బాధ ఉండదు. న్యూ ఇయర్ రిజల్యూషన్ సాఫీగా సాగుతుందన్న సంతోషం కలుగుతుంది! ఉదాహరణకు రోజుకో పది పేజీలు చదవాలి అని అనుకున్నారనుకోండి. రెండు రోజులు చదివేసరికి అది కష్టం అనిపించొచ్చు. అప్పుడు ఐదు పేజీలకు తగ్గించుకుని చూస్తే ఈజీగా చదివేయొచ్చు. అదే కొనసాగిస్తే సరిపోతుంది. అంటే మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందన్నమాట.

మీ కొత్త సంవత్సరం రిజల్యూషన్ డబ్బు ఆదా అనుకోండి. అయితే, ఇప్పటి నుంచే రోజుకి కొంత చొప్పున చేస్తూ వెళ్లండి. ఇబ్బంది లేదనుకోండి. కంటిన్యూ చేస్తారు. అంటే త్వరిత ఫలితం పొందొచ్చన్నమాట. కాబట్టి, జనవరిలో హడావుడిగా ఎందుకు? ఇప్పట్నుంచే మొదలుపెట్టండి. వీలైనవి కొనసాగించొచ్చు. అలాగే తీర్మానాల విషయంలో పట్టు సడలకుండా వాటికి కట్టుబడి ఉంటారని నిపుణులు సలహా ఇస్తున్నారు.

న్యూ ఇయర్ రిజల్యూషన్​లో బిజినెస్ ప్లాన్ ఉందా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.