Curd Pack for Hair Benefits: మీరు ఎన్ని కండిషనర్లు వాడినా జుట్టు మళ్లీ పొడిగానే మారుతుందా? వెంట్రుకల చివర్లు చిట్లిపోయి జుట్టంతా డ్యామేజ్ అవుతోందా? డాండ్రఫ్‌తో వెంట్రుకలు బలహీనమై ఎక్కువగా రాలిపోతున్నాయా? అయితే ఈ సమస్యలన్నింటిని పరిష్కరించడానికి ఓ సహజసిద్ధమైన మార్గం ఉందని నిపుణులు చెబుతున్నారు. 'పెరుగుతో హెయిర్ ప్యాక్స్' వల్ల ఈ సమస్యలు రావని అంటున్నారు. పెరుగులో ఉండే పోషకాలు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేసి వెంట్రుకలకు బలాన్ని, మెరుపునూ ఇస్తాయని వివరిస్తున్నారు. 2018లో Journal of Cosmetic Scienceలో ప్రచురితమైన "Evaluation of the efficacy of a hair care product containing yogurt extract on hair growth" అధ్యయనంలోనూ ఈ విషయం వెల్లడైంది. ఇంకా ఈ ప్యాక్స్ ఎండ, కాలుష్యాల నుంచి కూడా జుట్టును కాపాడడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పెరుగుతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే కొన్ని హెయిర్ ప్యాక్స్ గురించి తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
తేనెతో షైనీగా
కావాల్సినవి
- ఒక కప్పు గడ్డ పెరుగు
- ఒక చెంచా నిమ్మరసం
- ఒక చెంచా తేనె
ప్యాక్ ఇలా!
ఇందుకోసం ముందుగా గడ్డ పెరుగులో నిమ్మరసం, తేనె వేసి పేస్ట్ లాగా అయ్యేంతవరకూ కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పెట్టుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ రాసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే జుట్టుకు మెరుపు రావడంతో పాటు ఆరోగ్యంగా తయారవుతుందని నిపుణు అంటున్నారు. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవచ్చని వివరిస్తున్నారు.
ఆలివ్ ఆయిల్‌తో
కావాల్సినవి
- ఒక కప్పు గడ్డ పెరుగు
- మూడు చెంచాలు ఆలివ్ ఆయిల్
ప్యాక్ ఎలా చేసుకోవాలి?
ఇందుకోసం ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దీనిలోంచి కాస్త మిశ్రమాన్ని మాడుపై వేసి ఓ పది నిమిషాల పాటు గుండ్రంగా మర్థన చేసుకోవాలి. అనంతరం మిగిలిన పేస్ట్‌తో జుట్టు మొత్తం కింది వరకూ ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇలా చేసిన అరగంట తర్వాత షాంపూతో శుభ్రంగా తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకుంటే మరింత మెరుగైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
మృదువైన కురుల కోసం
కావాల్సినవి
- ఒక కప్పు గడ్డ పెరుగు
ప్యాక్ ఎలా చేసుకోవాలి
ముందుగా గడ్డ పెరుగు తీసుకుని పేస్ట్ లాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టుకు, మాడుకు పట్టించి ఒక మాస్క్ లాగా వేసుకోవాలి. అనంతరం తల చుట్టూ కాటన్ టవల్ చుట్టుకొని అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ రాసుకోవాలని చెబుతున్నారు. ఫలితంగా జుట్టు మృదువుగా తయారవడంతో పాటు మెరుపు కూడా వస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. సాధారణ జుట్టు ఉన్న వారు వారానికోసారి, పొడి జుట్టు ఉన్న వారు వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ట్రై చేయడం మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ముక్కుపై గరుకుగా తగులుతున్నాయా? అసలెందుకు వస్తాయి? ఎలా తగ్గించుకోవాలి?
ఈ డ్రింక్స్ తాగేవారికి క్యాన్సర్ ముప్పు! - లివర్ దెబ్బతింటుందట! - రీసెర్చ్‌లో వెల్లడి!