ETV Bharat / business

సైబర్ మోసాల నుంచి తప్పించుకోండిలా!

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు భారీగా పెరిగిపోయాయి. వీటిలో చాలా వరకు మోసాల బారిన పడిన వ్యక్తులు చేసిన చిన్న చిన్న పొరపాట్లే కారణం. ఆ పొరపాట్లు చేసేటప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోరు చాలా మంది. ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటి? వాటి వల్ల కలిగే నష్టాలేంటి? మోసాల బారిన పడకుండా ఏం చేయాలి?

సైబర్ మోసాలు
author img

By

Published : Jul 28, 2019, 4:55 PM IST

ఆర్థిక లావాదేవీల విషయంలో చేసే చిన్నచిన్న పొరపాట్లు భారీ ఆర్థిక మోసాల బారిన పడేందుకు కారణమవుతాయి. మరి అలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

మీ కార్డుల వివరాలు

డెబిట్​ కార్డులపై 16 అంకెలతో కూడిన ప్రత్యేక నెంబరు ఉంటుంది. ఈ నెంబరు ఎవరికీ చెప్పకూడదు. మీ కార్డును క్లోనింగ్ చేసేందుకు ఇదే ప్రాథమిక సమాచారంగా మారే అవకాశం ఉంది. కార్డుపై ఉండే నెంబరు మీ గుర్తింపునకు, ఆన్​లైన్ లావాదేవీలకు ఉపయోగపడేందుకు మాత్రమే. ఇలాంటి వివరాలు ఎవరికీ ఇవ్వకూడదు.

సీవీవీ చెప్పకండి..

దాదాపు అన్ని రకాల కార్డుల (రూపే, వీసా వంటివి) వెనుక వైపు మూడంకెల సీవీవీ నెంబర్ ఉంటుంది. సీవీవీ అంటే 'కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ'. ఈ మూడంకెల కోడ్ ఆన్​లైన్ లావాదేవీలు పూర్తయ్యేందుకు తోడ్పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నెంబర్​ను ఎవరికీ చెప్పకూడదు.

కార్డు నెంబరు, సీవీవీ మొదటి అంచె భద్రత కోసం బ్యాంకు ఇచ్చే సదుపాయాలు. డెబిట్ కార్డు ద్వారా అన్​లైన్ లావాదేవీలకు ఈ రెండింటి వివరాలు తప్పనిసరి.

మీ పాస్​వర్డ్ గోప్యంగా ఉంచండి

ఆన్​లైన్ లావాదేవీలను కార్డులతో పాటు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్​ ద్వారా జరిపే వీలుంది. వీటితో పాటు క్రెడిట్ కార్డుతో జరిపే చెల్లింపుల్లో కస్టమర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (సీఐఎన్​) పాస్​వర్డ్ తప్పనిసరి. ఒకవేళ కార్డు వివరాలు ఎవరైనా దొంగిలించి తెలుసుకున్నా పాస్​వర్డ్​ మాత్రం మీ అధీనంలోనే ఉంటుంది. అందువల్ల పాస్​వర్డ్​ బయటకు చెప్పి చిక్కుల్లో చిక్కుకోకూడదు.

ఎప్పటికప్పుడు 'పిన్' మార్చండి

షాపింగ్ చేసినప్పుడు, ఏటీఎం నుంచి డబ్బులు విత్​డ్రా చేసుకునేటప్పుడు నాలుగు (కొన్ని బ్యాంకులకు ఆరు) అంకెల పిన్​ను వాడుతుంటాం. అయితే ఈ పిన్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రెస్టారెంట్లలో బిల్లు చెల్లించేందుకు కార్డును ఇచ్చి పిన్ చెప్పి స్వైప్ చేయమంటుంటారు చాలా మంది. అది చాలా పొరపాటు. అప్పటికప్పుడు ఆ వివరాలు దుర్వినియోగం కాకపోయినా.. వాటి ఆధారంగా ఆర్థిక నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కనీసం రెండు నెలలకు ఓ సారి పిన్ మార్చుకోవడం మంచిది.

వన్​ టైం పాస్​వర్డ్​

ఆర్థిక లావాదేవీలతో పాటు పలు ఇతర గుర్తింపులు ఇప్పుడు వన్​ టైం పాస్​వర్డ్ (ఓటీపీ) ద్వారానే జరుగుతున్నాయి. వినియోగదారుడు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్​కే ఈ ఓటీపీ వస్తుంది. లావాదేవీ పూర్తి అయ్యేందుకు ఇది చివరి దశ. ఈ ఓటీపీ నిర్ణీత సమయం వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత ఉపయోగించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే లావాదేవీల్లో పటిష్ఠమైన భద్రతగా ఓటీపీని భావిస్తుంటారు.

అయితే ఎవరైనా మీ ఓటీపీ చెప్పమని అడిగితే నిరభ్యంతరంగా తిరస్కరించండి. ముఖ్యంగా బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నాం అని మీ ఓటీపీ అడిగితే ఎలాంటి వివరాలు చెప్పకూడదు. ఎందుకంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీని అడగవు.

అలాంటి అనుభవం ఎదురైనప్పుడు ఆ ఫోన్ నెంబర్ వివరాలు జోడిస్తూ సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయడం మంచిది.

ఇదీ చూడండి: ఇంటికే కాదు ఇంట్లోని వస్తువులకూ బీమా!

Intro:Body:

a

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.