ETV Bharat / business

2018-19లో హెచ్​ఏఎల్ రికార్డు స్థాయి ఆదాయం

ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్​ ఎరోనాటిక్స్ లిమిటెడ్​ 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.19,705 కోట్ల ఆదాయాన్ని గడించింది. ఇదే కాలంలో రూ. 2,282 కోట్ల లాభాలు ఆర్జించింది.

హల్​
author img

By

Published : May 28, 2019, 3:21 PM IST

ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఎరోనాటిక్స్​ లిమిటెడ్ (హాల్​) రికార్డు స్థాయి అదాయన్ని గడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.19,705 కోట్ల ఆదాయం పొందినట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 7.8 శాతం అధికం.

పన్నుల తర్వాత సంస్థ లాభాలు 2018-19లో రూ. 2,282 కోట్లుగా పేర్కొంది హాల్. 2017-18లో నమోదైన రూ.1,987 కోట్ల లాభంతో పోలిస్తే ప్రస్తుత లాభాలు 14.8 శాతం ఎక్కువ.

హాల్ ఇప్పటికే 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 662 కోట్ల మధ్యంతర డివిడెండును చెల్లించింది.

నిధుల కొరత కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో సంస్థ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు రూ. 1,000 కోట్ల రుణాన్ని తీసుకున్న హాల్ చివరకు భారీ లాభాలను నమోదు చేయడం గమనార్హం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తేలికపాటి యుద్ధ విమానాలు, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లకు తాజా ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నట్లు హాల్ పేర్కొంది.
2019 మార్చి31 నాటికి కంపెనీకి రూ.58,000 కోట్ల విలువైన ఆర్డర్లున్నాయి.

ఇదీ చూడండీ: ఐటీ కంపెనీల లాభాలకు వీసా నిబంధనల గండి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.