ETV Bharat / business

ఎయిర్​ ఇండియాకు బిడ్ల దాఖలుకు మరింత గడువు!

author img

By

Published : Oct 29, 2020, 5:42 PM IST

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయానికి మరోసారి గడువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 30తో ప్రస్తుత గడువు ముగియనున్న నేపథ్యంలో.. మరోసారి గడువు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అప్పులపై కొనుగోలుదారులకు ఊరటనిచ్చే కోణంలో ఈ నిర్ణయం ఉండనున్నట్లు తెలుస్తోంది.

Govt likely to extend Air India bid deadline
ఎయిర్​ఇండియాకు బిడ్ల దాఖలకు గడువు పెంపు

అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ​ఇండియా కొనుగోలుకు బిడ్లు దాఖలు చేసేందుకు మరింత గడువు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత గడువు శుక్రవారం (అక్టోబర్ 30)తో ముగియనుంది. అయితే డిసెంబర్ 14 వరకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఎయిర్​ ఇండియా అప్పుల విషయంలో కొనుగోలుదారుకు మరింత ఊరటనిచ్చే యోచనలో భాగంగా గడువు పెంపు ఉండనున్నట్లు వివరించాయి.

గడువు పెంపుపై ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజం (ఏఐఎస్​ఏఎం) స్పష్టతనిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బిడ్ల దాఖలుకు ఆసక్తిగా ఉన్న సంస్థలు ప్రీలిమ్నరీ ఇన్​ఫర్మేషన్ మెమోరాండమ్​ (పీఐఎం)లో మార్పులపై సందేహాలను అడిగేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:టీకా ట్రయల్స్​కు డాక్టర్ రెడ్డీస్ కసరత్తు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.