ETV Bharat / business

గూగుల్ మ్యాప్​లో బస్సులు, రైళ్ల వివరాలు!

టెక్ దిగ్గజం గూగుల్ భారత్​లో మరో అధునాతన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రజారవాణా సాధనాలైన బస్సులు, రైళ్ల సమచారాన్ని తెలుసుకునే కొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పది ప్రధాన పట్టణాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు గూగుల్ తెలిపింది.

author img

By

Published : Jun 5, 2019, 7:48 AM IST

గూగుల్ మ్యాప్​

ప్రజారవాణాకు ఉపయోగపడే సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది టెక్​ దిగ్గజం గూగుల్. గూగుల్ మ్యాప్స్​ ద్వారా రైళ్లు, బస్సుల సమాచారాన్ని లైవ్​లో తెలుసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది.

దేశంలో తొలిసారి ప్రవేశపెట్టిన ఈ సౌకర్యాన్ని ప్రస్తుతం హైదరాబాద్​, దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, పుణే, లఖ్​నవూ, మైసూర్, కోయంబత్తూర్​, సూరత్​ల్లో (పది నగరాలు) అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది గూగుల్​.

మ్యాప్స్​ ద్వారా బస్సుల రాకపోకల సమయాలను తెలుసుకోవచ్చు. లైవ్​ ట్రాఫిక్​ ఆధారంగా బస్సులు ఆలస్యమయ్యే సమయాన్ని కూడా కచ్చితంగా లెక్కించి వినియోగదారులకు సమాచారం అందిచనుంది గూగుల్​.

రైళ్లు ఏ సమయానికి ఏ ప్లాట్ ఫారం మీదికి వస్తాయి, ఏ సమయానికి బయల్దేరతాయి అనే విషయాలను వినియోగదారులకు అందించనుంది టెక్​ దిగ్గజం.

వీటితో పాటు అటోలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి, గమ్యస్థానానికి చేరేందుకు ఎంత సమయం పడుతుందనే విషయాలు తెలుసుకునే సౌకర్యాన్ని కూడా అందిస్తున్నట్లు పేర్కొంది గూగుల్​. అయితే ఈ ఫీచర్​ను ప్రస్తుతానికి దిల్లీ, బెంగళూరుల్లో మాత్రమే అందిస్తున్నట్లు చెప్పింది.

గత ఏడాది కొనుగోలు చేసిన.. వేర్ ఈజ్​ మై ట్రైన్ యాప్​ భాగస్వామ్యంతో ఈ నూతన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్​ పేర్కొంది.

ఇదీ చూడండి:ఐట్యూన్స్​ సేవలకు యాపిల్​ సెలవు

Chennai, June 05 (ANI): Ahead of World Environment Day on June 5, the 'Tree Ambulance' launched in Chennai by environmentalist Dr Abdul Ghani on June 4, aims at providing first-aid-like services for trees. Planting uprooted trees and offer services like seed ball distribution, plant distribution, aiding tree plantation, shifting and survey of trees and removal of dead trees. While speaking to ANI, founder Abdul Ghani said, "Our aim to implement it across the country by year 2020".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.