బులియన్ మార్కెట్లో నేడు ఒక్కొ రోజే పసిడి ధర 10 గ్రాములకు రూ. 400 తగ్గింది. ఫలితంగా 10 గ్రాముల బంగారం ధర (దిల్లీలో) రూ.35,400లకు చేరింది. దేశీయ వ్యాపారుల నుంచి డిమాండు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది.
బంగారం బాటలోనే వెండి కూడా కిలోకు రూ.125 తగ్గి.. ప్రస్తుతం రూ. 39,075కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పసిడి ధర 15.21 డాలర్లు పెరిగింది. పెరిగిన ధరలతో ఔన్సు బంగారం ధర 1,409.40 డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి: స్టేట్ బ్యాంక్లో డిజిటల్ లావాదేవీలన్నీ ఫ్రీ