ETV Bharat / business

కరోనాతో పసిడి దిగుమతులు 94 శాతం తగ్గాయ్‌

కరోనా సంక్షోభానికి తోడు, ధరలు బాగా పెరగడం వల్ల పసిడి దిగుమతులు భారీగా తగ్గాయి. ఈ ఏప్రిల్​-జూన్​లో సుమారు రూ. 5160 కోట్ల విలువైన బంగారం భారత్​లోకి ఎగుమతి అయింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే చాలా చాలా తక్కువ. ఈ కారణంతో.. దేశ వాణిజ్య లోటు దిగొచ్చింది.

author img

By

Published : Jul 20, 2020, 7:18 AM IST

Gold imports dip 94 pc in Apr-Jun to USD 688 million
పసిడి దిగుమతులు 94 శాతం తగ్గాయ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పసిడి దిగుమతులు భారీగా అదుపులోకి వచ్చాయి. ఏప్రిల్‌-జూన్‌లో 68.80 కోట్ల డాలర్ల (సుమారు రూ.5160 కోట్ల) విలువైన బంగారం దేశంలోకి దిగుమతి అయింది. 2019-20 ఇదే కాలంలో 1150 కోట్ల డాలర్ల (సుమారు రూ.86,250 కోట్ల) విలువైన పుత్తడి దేశంలోకి దిగుమతి అయ్యిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో వెండి దిగుమతులు కూడా 45 శాతం తగ్గి 57.50 కోట్ల డాలర్ల (సుమారు రూ.4300 కోట్ల)కు పరిమితమయ్యాయి. కొవిడ్‌-19 సంక్షోభానికి తోడు, ధరలు బాగా పెరగడం కూడా ఇందుకు కారణమని భావిస్తున్నారు.

దిగివచ్చిన వాణిజ్యలోటు: బంగారం, వెండి దిగుమతులు భారీగా తగ్గడంతో, దేశ వాణిజ్య లోటు ఏప్రిల్‌-జూన్‌లో 912 కోట్ల డాలర్ల (సుమారు రూ.68,400 కోట్ల)కు పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఈ మొత్తం 4596 కోట్ల డాలర్లు (సుమారు రూ.3,44,700 కోట్లు) కావడం గమనార్హం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.