పసిడి ధరలు జీవన కాల రికార్డు స్థాయికి పెరిగాయి. నేటి బులియన్ మార్కెట్లు ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.50 పెరిగి.. రూ.38,820కి చేరింది. దేశీయంగా నగల వ్యాపారుల నుంచి వస్తున్న స్థిరమైన కొనుగోళ్లతో.. ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది.
గత సెషన్లో భారీగా తగ్గిన వెండి ధర.. నేడు అదే స్థాయిలో పుంజుకుంది. నేటి బులియన్ సెషన్ ముగిసే సమయానికి కిలో వెండి ధర రూ.1,140 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.45,040గా ఉంది.
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలతో రిస్కు తక్కువగా ఉండే బంగారంపై మదుపరులు ఆసక్తి చూపడమూ.. ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర కాస్త తగ్గి 1,499.20 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 17.08 డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి: హైదరాబాద్లో అతిపెద్ద అమెజాన్ ప్రాంగణం ప్రారంభం