ETV Bharat / business

'ఫ్లిప్​కార్ట్​ హోల్​సేల్'​ కార్యకలాపాలు షురూ - ఈ-కామర్స్​

వాల్​మార్ట్​ ఇండియాను కొనుగోలు చేసిన అనంతరం 'ఫ్లిప్​కార్ట్​ హోల్​సేల్​' పేరుతో మూడు నగరాల్లో కార్యకలాపాలను ప్రారంభించింది ఫ్లిప్​కార్ట్​. ఈ ఏడాది చివరికి మరో 20నగరాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు వెల్లడించింది.

Flipkart Wholesale launches operations in 3 cities, to expand to 20 more cities by year-end
'ఫ్లిప్​కార్ట్​ హోల్​సేల్'​ కార్యకలాపాలు షురూ
author img

By

Published : Sep 2, 2020, 7:40 PM IST

భారత్​లో హోల్​సేల్​ వ్యాపారాలకు పెరుగుతున్న డిమాండ్​ నేపథ్యంలో.. ఇటీవలే 'వాల్​మార్ట్​ ఇండియా'ను కొనుగోలు చేసి 'ఫ్లిప్​కార్ట్​ హోల్​సేల్​' అనే పేరుపెట్టింది ఫ్లిప్​కార్ట్​. తాజాగా.. మూడు నగరాల్లో కార్యకలాపాలను ప్రారంభించింది 'ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌'. స్థానిక తయారీదారులను రిటైలర్లతో అనుసంధానించనున్నట్టు పేర్కొంది.

అమెజాన్​, ఉడాన్​ వంటి ప్రత్యర్థులతో పోటీపడటానికి ఈ చర్యలు ఉపయోగపతాయని సంస్థ భావిస్తోంది.

"ముందుగా ఫ్యాషన్​(ఫుట్​వేర్​, యాక్ససరీస్​)తో మొదలుపెడుతున్నాం. గురుగ్రామ్​, దిల్లీ, బెంగళూరులో కార్యకలాపాలు ప్రారంభించాం. ఈ ఏడాది చివరి నాటికి ఇంకో 20 నగరాలకు కార్యకలాపాలను విస్తరిస్తాం. గృహోపకరణాలు, కిరాణాను కూడా జోడిస్తాం."

---ఆదర్ష్​ మేనన్​, ఫ్లిప్​కార్ట్​ హౌల్​సేల్​ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​.

సాంకేతికతను వినియోగించుకుని కిరాణా షాపులు అభివృద్ధి చెందడమే ముఖ్య లక్ష్యమని ఆదర్ష్​ మేనన్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:- 90 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.