ETV Bharat / business

Flipkart: ఫ్లిప్​కార్ట్​కు రూ.10,600 కోట్ల జరిమానా!

ఫారెన్​ ఎక్స్చేంజ్​ మేనేజ్​మెంట్​ చట్టంలోని నిబంధనల ఉల్లంఘనల కింద ఫ్లిప్​కార్ట్​కు(Flipkart) రూ.10వేల కోట్ల జరిమానా(penalty on flipkart) నోటీసులు పంపించింది ఈడీ(enforcement directorate). నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నోటీసులపై మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించారు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు సచిన్​ బన్సాల్​.

author img

By

Published : Sep 3, 2021, 7:03 PM IST

Updated : Sep 3, 2021, 11:00 PM IST

Flipkart
ఫ్లిప్​కార్ట్​కు జరిమానా

ప్రముఖ ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​కు(Flipkart) ఫారెన్​ ఎక్స్చేంజ్​ మేనేజ్​మెంట్​ చట్టం(foreign exchange management act) నిబంధనల ఉల్లంఘన కింద నోటీసులు పంపింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(enforcement directorate)​. రూ.10,600 కోట్ల మేర జరిమానా(penalty on flipkart) ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంస్థ వ్యవస్థాపకులతో పాటు మరో తొమ్మిది మందికి ఈ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది.

ఈ నోటీసులను సవాల్​ చేస్తూ మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించారు ఫ్లిప్​కార్ట్​ సహ వ్యవస్థాపకుడు సచిన్​ బన్సాల్​.

" 2010లో నేను ఫ్లిప్​కార్ట్​ సంస్థ నుంచి బయటకు వచ్చేశాను. కంపెనీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. చాలా సందర్భాల్లో ఈడీకి ఈ విషయాన్ని వివరించాను. కానీ, 12 ఏళ్ల తర్వాత నాకు నోటీసులు ఇచ్చారు. నోటీసులను ఉపసంహరించుకోవాలి. "

- సచిన్​ బన్సాల్​, ఫ్లిప్​కార్ట్​ సహ వ్యవస్థాపకుడు.

సచిన్​ పిటిషన్​పై విచారణ చేపట్టింది జస్టిస్​ మహదేవన్​ నేతృత్వంలోని ధర్మాసనం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే 12 ఏళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతోందని వ్యాఖ్యానించింది. మూడు వారాల్లో పూర్తి వివరణ ఇవ్వాలని ఈడీని ఆదేశించింది.

ఇదీ చూడండి: Flipcart: ఫ్లిప్​కార్ట్ పార్శిళ్లలో రాళ్లు, పెంకులు... నలుగురు అరెస్ట్

Last Updated : Sep 3, 2021, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.