వినియోగదారులకు ధరలతో చుక్కలు చూపిస్తున్న కొన్ని ఫైవ్ స్టార్ హోటళ్లపై కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాసవాన్ మండిపడ్డారు. ఇటీవల అరటి పండ్లు, కోడిగుడ్ల ధరల విషయంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన అంశాలపై స్పందించారు మంత్రి.
"ఫైవ్‌స్టార్ హోటళ్లలో అరటి పండ్లు, కోడిగుడ్ల బిల్లులపై సామాజిక మాధ్యమాల్లో చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇలాంటి సంఘటనలు దురదృష్టకరం. గరిష్ఠ అమ్మకపు ధర(ఎమ్మార్పీ)కి మించి అమ్మడాన్ని మేం అంగీకరించం. ఈ అక్రమ వ్యాపారాలపై సదరు హోటళ్ల నుంచి వివరణ తీసుకుంటాం. తప్పు అని తేలితే చర్యలు తీసుకుంటాం."
-రామ్‌విలాస్ పాసవాన్, కేంద్ర మంత్రి
ఈ నేపథ్యంలో ఇటీవల తీసుకొచ్చిన వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రస్తావించారు పాసవాన్. ఇలాంటి కేసుల్లో చర్యలు తీసుకునేందుకు చట్టంలో అన్ని నిబంధనలను పక్కాగా రూపొందించామని పేర్కొన్నారు.
బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ ట్విట్టర్లో అరటిపండ్లపై చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. జులై 22న ఛండీగఢ్‌లోని ఓ హోటల్లో రెండు అరటిపండ్లకు రూ. 442.50 బిల్లు వేయడాన్ని నిరసిస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. ఈ విషయంపై స్పందించిన ఛండీగఢ్ ఎక్సైజ్, పన్నుల శాఖ కమిషనర్ మణ్‌దీప్ సింగ్ భర్ సంబంధిత హోటల్‌కు రూ. 25 వేల జరిమానా విధించారు.
తాజాగా ముంబయిలో రెండు కోడిగుడ్లకు రూ.1,700 బిల్ చేయటం మరింత చర్చకు దారితీసింది.
ఇవీ చూడండి: