సామాజిక మాధ్యమ దిగ్గజం 'ఫేస్బుక్' యూజర్ల లొకేషన్ ట్రాకింగ్‌కు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపెట్టింది. సెట్టింగ్స్‌లో ట్రాకింగ్ సదుపాయాన్ని నిలిపినప్పటికీ.. తమ యూజర్లు ఎక్కడున్నారనేది తాము తెలుసుకోగలుగుతామని వెల్లడించింది.
ఇద్దరు అమెరికన్ సెనెటర్లు చేసిన అభ్యర్థన మేరకు ఈ విషయాలు వెల్లడించింది ఫేస్బుక్. యూజర్ల లొకేషన్‌ను తెలుసుకోవడం ద్వారా దగ్గర్లోని దుకాణాల సమాచారం ఇవ్వడం సహా హ్యాకర్లు, తప్పుదోవ పట్టించే వారి నుంచి వినియోగదారుల్ని రక్షించవచ్చని వివరించింది.
ఫేస్బుక్ వెల్లడించిన ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
"ఇక్కడ ఆప్టింగ్ ఔట్ సదుపాయం లేదు. మీ వ్యక్తిగత సమాచారంపై మీకు నియంత్రణ లేదు. అది పెద్ద టెక్ సంస్థ. అందుకే కాంగ్రెస్ దానిపై చర్యలు తీసుకోవాలి" అని రిపబ్లికన్ సెనెటర్ జోష్ హౌలే ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:రూ.5.6 కోట్ల జరిమానా చెల్లింపునకు సిద్ధమైన ఇన్ఫీ!