పోస్టులకు లైక్‌లు దాచే సదుపాయాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఎక్కువ లైక్‌లు ఎవరికి వచ్చాయనే విషయంపై కాకుండా.. పోస్టుల్లో ఉన్న విషయంపై యూజర్లు దృష్టి సారిస్తారని ఫేస్బుక్ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్.. ఇదే తరహాలో లైక్‌లు దాచే సదుపాయాన్ని 12కు పైగా దేశాల్లో పరీక్షిస్తోంది. అయితే ఒక పోస్టుకు వచ్చిన లైక్‌లు ఇతరులు చూసే వీలు లేనప్పటికీ.. పోస్టు చేసిన యూజర్ మాత్రం వాటిని చూసే వీలుంటుంది.
ట్విట్టర్లో విఫలం
మరో సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ ఇలాంటి సదుపాయాన్నే పరీక్షించింది. ఒక ట్వీట్‌ను ఎంత మంది లైక్ చేశారు.. ఎంత మంది రీట్వీట్ చేశారనేది ఇతరులకు కనిపించకుండా ఉండే ఫీచర్‌ను పరీక్షించింది. ఇలా చేయడం వల్ల యూజర్లకు ట్వీట్లపై ఆసక్తి తగ్గిపోయినట్లు ట్విట్టర్ గ్రహించింది.
ఇకపై ట్యాగ్ సజెషన్
ఫేస్బుక్ పోస్టుల్లో ఉండే వ్యక్తుల ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) సదుపాయం స్థానంలో ట్యాగ్ సూచన (ట్యాగ్ సజెషన్స్) ఫీచర్‌ను తీసుకురానున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. ఫేస్ రికగ్నిషన్ ఫీచర్.. ఇప్పటి వరకు ఫొటోల్లో ఉన్న వ్యక్తులను గుర్తించి వారిని ట్యాగ్ చేసేందుకు ఉపయోగపడేది. ఫొటోల్లోని వ్యక్తులను గుర్తించి ట్యాగ్ చేసేందుకు 'ట్యాగ్ సజెషన్'ను వినియోగించనున్నారు.
ఇదీ చూడండి: యూట్యూబ్‌లో మాతృభాషకే వీక్షకుల జై!