సామాజిక మాధ్యమాల దిగ్గజం ఫేస్‌బుక్, ప్రముఖ టెలికాం సంస్థ రిలయెన్స్ జియోలో పదిశాతం వాటా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఫేస్‌బుక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది.
అయితే రిలయన్స్ జియో కానీ, ఫేస్‌బుక్ కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా ఒప్పందం కుదిరేందుకు మరింత సమయం పట్టవచ్చని ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ డైలీ పేర్కొంది.
ఈ నెలాఖరు కల్లా జియోను అప్పుల్లేని సంస్థగా తీర్చిదిద్దాలని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే జియోలో ఫేస్‌బుక్ వాటా కొనుగోలు చేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి.