ETV Bharat / business

ఫేస్​యాప్ వాడుతున్నారా...​ గోప్యతపై జర భద్రం! - Face App

ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉన్న ఫేస్​యాప్​.. వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఐఫోన్​ యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే వినియోగదారుల డేటాను కేవలం యాప్​ అభివృద్ధి కోసమే వాడుతున్నామని ఫేస్​యాప్ గోప్యతపై భరోసానిస్తోంది సంస్థ.

ఫేస్​యాప్ వాడుతున్నారా...​ గోప్యతపై జర భద్రం!
author img

By

Published : Jul 19, 2019, 5:29 PM IST

ఫేస్​యాప్ వాడుతున్నారా...​ గోప్యతపై జర భద్రం!

ఫేస్​యాప్.. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ యాప్​ దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్​ఫోన్​లోనూ డౌన్​లోడై ఉంటుంది. ముఖాలను వృద్ధులుగా లేదా యవ్వనంగా ఎలా కావాలంటే అలా ఫిల్టర్​ చేసే ఈ యాప్..​ మొబైల్​ యూజర్లను తెగ ఊరిస్తోంది. అయితే ఈ అప్లికేషన్​ ​ ఫోన్లలోని గోప్యమైన సమాచారాన్ని సైతం తెలుసుకోగలదనే సందేహాలు ప్రస్తుతం ట్విట్టర్​ వేదికగా తలెత్తుతున్నాయి.

అంతేకాదు ఫొటోలతో పాటు ఆర్థిక (బ్యాంకు అకౌంట్లు, పిన్​ నంబర్లు తదితర), ఆరోగ్య సంబంధ సమాచారాన్ని దానంతట అదే సర్వర్​లోకి అప్​లోడ్​ చేసుకుంటోందనే అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు వినియోగదారులు.

" ఇందులోని కొన్ని ఫోటోలు ఫేషియల్​ రికగ్నిషన్​ డేటాబేస్​​లో స్టోర్​ అవడం చూస్తున్నాం. అందులో కొన్నింటిని మూడో వ్యక్తికి, మరికొన్నింటిని డేటా బ్రోకర్స్​కు అమ్ముతున్నారు. ప్రకటనలను ఆకర్షించేందుకే వినియోగదారుల సమాచారాన్ని వాడుతున్నామని, సమాచారాన్ని మూడో వ్యక్తికి అమ్మడం లేదని సంస్థ తెలిపింది. ఫేస్​ యాప్​ సర్వర్​లోని 'చాలా వరకు ఫొటోలను' 48 గంటల్లో డిలీట్​ చేస్తున్నామని ప్రకటించింది. అయితే ఫొటోలన్నీ కాకుండా 'చాలా వరకు ఫొటోలు' అనడంలో అర్థమేంటి?. అది కాకుండా 48 గంటలన్నారు... ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారు."

- రాచెల్​ లెర్మాన్​, ది అసోసియేటెడ్​ ప్రెస్​ టెక్నాలజీ రిపోర్టర్​

అయితే ఫొటో లైబ్రరీ మొత్తం యాప్​లో కనిపించినప్పటికీ మనం సెలెక్ట్​ చేసిన ఫొటోను మాత్రమే ఫేస్ యాప్​ తీసుకోగలదని.. మొత్తం లైబ్రరీని యాక్సెస్​ చేయలేదని కొందరు చెబుతున్నారు. డేటాను చోరీ చేస్తోందనే ఊహాగానాలకు కచ్చితమైన ఆధారం వచ్చే వరకు ఫేస్​యాప్​ను వినియోగిస్తామని అంటున్నారు.

" మొబైల్​ యూజర్లు ఈ తరహా యాప్​లను బాగా వినియోగిస్తునారు. ఈ యాప్​లు వైరల్​గా మారుతున్నాయి. సమాచార గోప్యత అంశం నన్ను కచ్చితంగా ఆలోచించేలా చేసింది. అయితే నాకు సరైన ఆధారాలు దొరికే వరకు నేను ఫేస్​యాప్​ను వినియోగిస్తాను."

-కర్టీ జాన్​, ఫేస్​యాప్​ వినియోగదారు

Intro:Body:

i

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.