భారత్‌లో ఫైజర్ కొవిడ్ టీకా వినియోగానికి త్వరితగతిన అనుమతుల కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా సోమవారం వెల్లడించారు. ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేశాయి.
భారత్‌లో రోగనిరోధక శక్తి పెంపొందించే కార్యక్రమాలకుగానూ లాభా పేక్ష లేకుండా తమ టీకా విక్రయిస్తామని ఏప్రిల్ ఆరంభంలో ఫైజర్ ప్రకటించింది. ఇప్పటికీ ఆ వాగ్దానానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.
'ఈ మహమ్మారి అంతానికి వ్యాక్సిన్ల అవసరం చాలా ఉంది. దురదృష్టవశాత్తు మా టీకా భారత్‌లో నమోదు కాలేదు. నెలక్రితమే మేము దరఖాస్తు చేశాం.' అని ఫైజర్ పేర్కొంది.
అమెరికా, బ్రిటన్‌లోని ఔషధ నియంత్రణ సంస్థల నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన టీకాలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం గత నెలలోనే అనుమతులు ఇచ్చింది.
ఇదీ చదవండి:అలా చేస్తేనే కరోనా కట్టడి: సీఐఐ