ETV Bharat / business

వాట్సాప్​లో డార్క్​ మోడ్​ వచ్చేసిందోచ్​!

author img

By

Published : Mar 10, 2020, 10:08 AM IST

ప్రముఖ మెస్సేజింగ్ యాప్​ వాట్సాప్​లో డార్క్​ మోడ్​ వచ్చేసింది. ఇందులో భాగంగా ముదురు, లేత బూడిద రంగుల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫీచర్​ను పొందాలంటే వాట్సాప్​ తాజా అప్​డేట్​ను డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

whatsapp
డార్క్​ మోడ్​

ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న డార్క్​మోడ్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్​. భారత్​లోని 40 కోట్ల వినియోగదారులకు ముదురు, లేత బూడిద రంగుల్లో ఈ ఫీచర్​ను ప్రవేశపెట్టింది మెస్సేజింగ్ దిగ్గజం.

ఎన్నో పరిశోధనల తర్వాత ఈ రెండు రంగులను ఎంపిక చేసినట్లు వాట్సాప్ తెలిపింది. చదివేందుకు, విషయం సరిగ్గా కనిపించే విధంగా ఉండేందుకు ఈ రంగులను ఖరారు చేసినట్లు తెలిపింది.

తాజా అప్​డేట్​ అవసరం..

ఈ కొత్త ఫీచర్​ను పొందాలంటే వాట్సాప్​ తాజా అప్​డేట్​ను డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్​ 10, ఐఓఎస్​ 13 వినియోగదారులు సిస్టమ్​ సెట్టింగ్స్​లో డార్క్​మోడ్​ను ఎంపిక చేసుకోవాలి. ఆండ్రాయిడ్ 9, దానికింది ఆపరేటింగ్ సిస్టమ్స్​ వినియోగదారులైతే వాట్సాప్​ సెట్టింగ్స్​లోని చాట్స్​ >> థీమ్​ >> డార్క్​ మోడ్​ను ఎంపిక చేసుకోవాలి.

ప్రపంచంలో అత్యంత ప్రియమైన మెసేజింగ్ వేదికల్లో ఒకటైన వాట్సాప్ ఇటీవలే 2 బిలియన్ యాక్టివ్ యూజర్​లను దాటింది. ఫేస్​బుక్ యాజమాన్యంలోని ఈ అనువర్తనం సరికొత్త నవీకరణలు, గోప్యతా ప్రమాణాలతో వినియోగదారులకు అద్భుతమైన బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.