ETV Bharat / business

కరోనాపై పోరుకు ఆయిల్​ కంపెనీల నుంచి విరాళాల వెల్లువ

కరోనాకు వ్యతిరేకంగా పోరాడేందుకు మోదీ తీసుకొచ్చిన పీఎం కేర్స్ ఫండ్​కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. చమురు కంపెనీలు రూ.1000 కోట్లను ప్రకటించగా.. దాల్మియా సిమెంటు తదితర సంస్థలు తమ వంతు సాయాన్ని అందించాయి.

Coronavirus: Dalmia Bharat Group announces Rs 25 cr contribution to PM-CARES Fund
కరోనాపై పోరుకు ఆయిల్​ కంపెనీల విరాళాల జల్లు
author img

By

Published : Mar 31, 2020, 7:52 PM IST

కరోనాపై పోరుకు తమవంతు సాయంగా దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రముఖ ఆయిల్​ అండ్​ నేచురల్​ గ్యాస్​ క్రాప్ ​(ఓఎన్​జీసీ), ఇండియన్​ క్రాప్ ​(ఐఓసీ) సహా ఇతర ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కలిసి రూ. 1000 కోట్లను పీఎం రిలీఫ్​ ఫండ్​కు విరాళాలు ప్రకటించాయి.

ఓఎన్​జీసీ రూ.300 కోట్లు ఇవ్వగా.. ఐఓసీ సంస్థ రూ.225 కోట్లు ప్రకటించింది. భారత్​ పెట్రోలియమ్​ క్రాప్​ లిమిటెడ్ (బీపీసీఎల్​) రూ.175 కోట్లు, హిందుస్థాన్​ పెట్రోలియం క్రాప్ లిమిటెడ్​ (హెచ్​పీసీఎల్​) రూ. 120 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. వీటితో పాటు ఇతర ఎల్​ఎన్​జీ, జీఏఐఎల్​, ఆయిల్​ ఇండియా లిమిటెడ్​ సంస్థలూ తమ వంతు సాయాన్ని ప్రకటించాయి.

ప్రముఖ సిమెంట్​ తయారీ సంస్థ దాల్మియా భారత్ గ్రూప్​.. మంగళవారం రూ. 25 కోట్లను పీఎం కేర్స్​ ఫండ్​కు ప్రకటించింది.

కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరగకుండా పోరాడుతున్నాయి. మా వంతు సాయంగా రూ. 25 కోట్లను అందిస్తున్నాం. వైరస్​తో పోరాడేందుకు ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చేందుకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాం.

దాల్మియా సిమెంటు

మరోవైపు దాల్మియా ఫ్యాక్టరీల్లో ఆహార పదార్థాలను తయారు చేసి.. స్థానికులకు పంపిణీ చేస్తున్నారు. రోజూ మునిసిపాలిటీ, పోలీసుల ద్వారా ఆవాసం లేని వారికి 100కిపైగా ఆహార పొట్లాలను అందిస్తున్నారు.

మేము కూడా ఉన్నాం...

ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్​ దిగ్గజం షియోమి కరోనాను ఎదిరించేందుకు తన వంతుగా.. రూ.15 కోట్లను ప్రకటించింది. ఇందులో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని సీఎం రిలీఫ్​ ఫడ్స్​, పీఎం రిలీఫ్​ ఫండ్లకు వీటిని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. వీటితో పాటు అనేక రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో మాస్కులు, వ్యక్తిగత రక్షణ సూట్​ను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

రైతులకు సాయంగా...

ఇండియన్​ ఫార్మర్స్​ ఫెర్టిలైజర్​ లిమిటెడ్ ​( ఐఎఫ్​ఎఫ్​సీఓ) రూ. 25 కోట్ల రూపాయలను పీఎం కేర్స్​ ఫండ్​కు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇందులో రైతులకు, గ్రామాల్లో నివసిస్తున్నవారికి.. మాస్కులు, శానిటైజర్లు, క్రిమిసంహారక సబ్బులు, విటమిన్​-సీ ట్యాబ్​లెట్లు, నిత్యవసర సరుకులను అందజేయనున్నట్లు వెల్లడించింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.