ETV Bharat / business

ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోండిలా... - సెల్ఫ్ టెస్ట్​ కోసం మై ల్యాబ్​ నుంచి టెస్ట్​ కిట్​

దేశంలో కరోనా నిర్ధరణ పరీక్షల విషయంలో మరో ముందడుగు పడింది. వేగంగా ఇంటి వద్దే స్వయంగా కరోనా పరీక్ష చేసుకునేందుకు వీలుగా సరికొత్త ర్యాపిడ్ టెస్ట్​ కిట్​ను అందుబాటులోకి తెచ్చింది పుణెకు చెందిన మైల్యాబ్ అనే సంస్థ. వచ్చే వారం నుంచి ఈ కిట్లు మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి. మరి ఈ కిట్​ను ఎలా వాడాలి? టెస్ట్​ ఫలితం ఎలా తెలుసుకోవాలి? ధర ఎంత ఉంటుంది? అనే వివరాలు మీ కోసం.

Cipla launches RT-PCR test kit name
సిప్లా నుంచి ఆర్​టీపీసీఎస్ టెస్ట్​ కిట్​
author img

By

Published : May 20, 2021, 3:11 PM IST

Updated : May 20, 2021, 6:37 PM IST

దేశంలో రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో సరిపడా కిట్లు లేక టెస్టుల సంఖ్యను తగ్గించడం వంటివి చేస్తున్నాయి పలు రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలను వేగవంతం చేసే విధంగా మరో ముందడుగు పడింది. ఇకపై సులభంగా, స్వయంగా ఇంటి వద్దే కొవిడ్​ నిర్ధరణ చేసుకునేందకు వీలు కలగనుంది.

ఇంటి వద్దే కరోనా నిర్ధరణ పరీక్ష చేసుకునేందుకు అవసరమయ్యే ర్యాపిడ్ టెస్ట్ కిట్​ 'కొవిసెల్ఫ్​'ను పుణెకు చెందిన మైల్యాబ్​ సంస్థ రూపొందించింది. దీని వినియోగానికి ఐసీఎంఐర్ గురువారం​ ఆమోదముద్ర వేసింది. మరో 3-4 రోజుల్లో ఈ కిట్ మార్కెట్లో లభించనుంది.​ దీని ధర సుమారు రూ.250 ఉంటుందని సమాచారం. అన్ని మెడికల్ షాపులతో పాటు ఆన్​లైన్​ ద్వారా కూడా ఈ కిట్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.

Mylab Self test kit
మై ల్యాబ్​ సెల్ఫ్​ టెస్ట్ కిట్​

స్వయంగా ఎలా పరీక్షించుకోవాలి?

ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోండిలా...

కొవిసెల్ఫ్ కిట్​లో పరీక్షకు కావాల్సిన ఓ ద్రవంతో కూడిన ట్యూబ్‌, శాంపిల్‌ సేకరణకు స్వాబ్‌, టెస్ట్‌ కార్డు సహా.. పరీక్ష అనంతరం సురక్షితంగా వాటిని పడేసేందుకు కావాల్సిన కవర్​ ఉంటాయి.

Mylab Test kit
మైల్యాబ్ టెస్ట్ కిట్ లోపల ఉంటే సాధనాలు

టెస్ట్​ కిట్​ను ఉపయోగించేందుకు ముందు.. కొవి సెల్ఫ్​ యాప్​లో పరీక్ష చేసుకునే వ్యక్తి, టెస్ట్​ కిట్​ వివరాలు నింపాల్సి ఉంటుంది.

యాప్​లో నమోదు పూర్తయిన తర్వాత.. శుభ్రమైన ప్రాంతంలో టెస్ట్​ కిట్​ను తెరిచి అందులోని స్వాబ్, శాంపిల్​ ట్యూబ్​, టెస్ట్​ కార్డ్, బిన్ కవర్​ను వేర్వేరుగా పెట్టాలి.

స్వాబ్​ను జాగ్రత్తగా తీసుకుని రెండు నాసికా రంద్రాల్లో ఐదు సార్ల చొప్పున తిప్పి శాంపిల్​ను సేకరించాలి.

అలా సేకరించిన శాంపిల్​తో కూడిన స్వాబ్​ను ద్రవం ఉన్న ట్యూబ్​లో ఉంచి మూడు నుంచి నాల్గు సార్లు తిప్పాలి. ద్రవంలో శాంపిల్​ కలిసిన తర్వాత స్వాబ్​ మార్క్ వరకు తుంచేయాలి. ఆ తర్వాత ట్యూబ్​కు నాజిల్ ఉన్న మూత బిగించాలి.

టెస్ట్ కార్డు తీసుకుని.. శాంపిల్ కోసం కేటాయించిన ప్రాంతంలో ట్యూబ్​ నుంచి రెండు చుక్కలు వేయాలి.

టెస్ట్​ కార్డ్​పై సీ-క్వాలిటీ కంట్రోల్ వద్ద మాత్రమే చార కనిపిస్తే కొవిడ్ నెగెటివ్​గా పరిగణించాలి. దీనితో పాటు టీ- క్వాలిటీ కంట్రోల్ వద్ద కూడా (రెండు చోట్ల) చార కనిపిస్తే కరోనా పాజిటివ్​గా గుర్తించాలి.

ఈ పరీక్ష పూర్తయ్యేందుకు 15 నిమిషాలు పడుతుంది. అంతకంటే ఆలస్యంగా వచ్చే ఫలితాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని మైల్యాబ్​ సంస్థ స్పష్టం చేసింది.

కొవిసెల్ఫ్ యాప్​లో ముందుగా వివరాలు నమోదు చేయడం వల్ల కృత్రిమ మేధ ద్వారా 5-7 నిమిషాల్లోపే కరోనా ఫలితం కనిపిస్తుంది. పరీక్ష పూర్తయిన తర్వాత ఫలితాన్ని యాప్​ నుంచి డౌన్​లోడ్ కూడా చేసుకోవచ్చు. ఐసీఎంఆర్‌కు అనుసంధానమైన సర్వర్​లోనూ ఈ వివరాలు నిక్షిప్తమవుతాయి.

పరీక్ష పూర్తయిన తర్వాత టెస్ట్​ కోసం ఉపయోగించిన ట్యూబ్​, స్వాబ్, టెస్ట్​ కార్డ్ అన్నింటినీ.. కిట్​లో కేటాయించిన ప్రత్యేక కవర్​లో వేసి సురక్షితంగా పారేయాల్సి ఉంటుంది.

అయితే ఇది ర్యాపిడ్ టెస్ట్ అయినందున.. ఎవరికైనా లక్షణాలు ఉండి సెల్ఫ్​ టెస్ట్​లో నెగెటివ్​గా తేలితే.. ఆర్​టీ- పీసీఆర్​ చేయించుకోవాలని సూచించింది ఐసీఎంఆర్​. పాజిటివ్​గా తేలితే ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష అవసరం లేదని స్పష్టం చేసింది.

సిప్లా ఆర్​టీ-పీసీఆర్​ కిట్​..

దేశీయ ఔషధ సంస్థ సిప్లా.. కరోనా నిర్ధరణ పరీక్షల కోసం ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​ కిట్​ను ఆవిష్కరించింది. 'విరాజెన్​' పేరుతో దీనిని అందుబాటులోకి తెచ్చింది. 'యూబయో బయోటెక్నాలజీ సిస్టమ్స్'​ భాగస్వామ్యంతో ఈ కిట్​ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది సిప్లా.

Cipla Test kit
సిప్లా ఆర్​టీపీసీఆర్​ టెస్ట్ కిట్​

ప్రస్తుతం ఎదుర్కొంటున్న టెస్టింగ్ సామర్థ్యం సమస్యకు తమ టెస్ట్​ కిట్​తో పరిష్కారం లభిస్తుందని సిప్లా ఆశాభావం వ్యక్తం చేసింది. వెరిజెన్​ కిట్​లను మే 25 నుంచి సరఫరా చేయనున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:బిట్‌కాయిన్‌ ఢమాల్‌.. ఎందుకు?

Last Updated : May 20, 2021, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.