ETV Bharat / business

వాట్సాప్​ను అడ్డుకోండి: కోర్టుకు కేంద్రం వినతి - కొత్త ఐటీ రూల్స్​పై కేంద్రానికి హై కోర్టు నోటీసులు

వాట్సాప్​ ప్రైవసీ పాలసీలు అమలవకుండా ఆంక్షలు విధించాలని దిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్​ దాఖలు చేసింది. ఈ అంశంపై ఏప్రిల్​ 20న విచారణ జరపనుంది ధర్మాసనం.

WhatsApp to Restrict for not implement new Policy's
వాట్సాప్​పై ఆంక్షలు విధించాలని కేంద్రం వినతి
author img

By

Published : Mar 19, 2021, 4:27 PM IST

వాట్సాప్​ తీసుకొచ్చిన నూతన గోప్యతా నిబంధనలను అమలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని దిల్లీ హై కోర్టును కోరింది కేంద్రం. వాట్సాప్ నూతన పాలసీలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​కు.. స్పందనగా సమర్పించిన అఫిడవిట్​లో ఈ విషయాలు పేర్కొంది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్​ఫర్మేషన్​ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.

వాట్సాప్​ నూతన గోప్యతా విధానాలను సవాలు చేస్తూ.. సీమా సింగ్​, మేఘన్​ సింగ్, విక్రమ్ సింగ్ అనే వ్యక్తులు దిల్లీ హైకోర్టులో పిటిషన్​ వేశారు. వాట్సాప్ పాలసీలు.. భారతీయ డేటా, గోప్యత విధానాల్లో లోపాలను ఎత్తిచూపుతున్నట్లు అందులో పేర్కొన్నారు.

ఈ విషయంపై ఏప్రిల్​ 20న తదుపరి విచారణ జరపనుంది చీఫ్​ జస్టిస్​ డీఎన్​ పటేల్​, జస్టిస్​ జస్మీత్​ సింగ్​తో కూడిన ధర్మాసనం.

అభ్యంతరం ఇందుకే..

కొత్త నిబంధనల ప్రకారం.. షరతులకు అంగీకరిస్తేనే యూజర్​ యాప్ వాడేందుకు వీలుంటుంది. లేదంటే వాట్సాప్ పని చేయదు. మాతృసంస్థ ఫేస్​బుక్​, ఇతర థర్డ్​ పార్టీ యాప్​లతో డేటా షేర్ చేయాలా వద్దా అని ఎంపిక చేసుకునే సౌకర్యం మాత్రం యూజర్​కు లేదు. వాట్సాప్ కొత్త నిబంధనలు మే 15 నుంచి అమలు కానున్నాయి.

ఐటీ రూల్స్​పై కేంద్రానికి నోటీసులు..

డిజిటల్​ న్యూస్​ మీడియాకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​పైనా దిల్లీ హై కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలపాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, బ్రాడ్​కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. కేంద్రం స్పందన తెలిపేందుకు కొంత సమయాన్ని కేటాయించింది.

ఈ పిటిషన్​పై తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది ధర్మాసనం. అదే రోజున మీడియాకు సంబంధించిన పలు పాత కేసులు కూడా విచారణకు రానున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.