స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. వృద్ధికి ఊతమందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఆశలు.. స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు అడ్డుకట్ట వేశాయి. ముఖ్యంగా మిడ్ సెషన్ తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతు నేటి లాభాలకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 228 పాయింట్లు బలపడింది. చివరకు 36,701 పాయింట్ల స్థాయిని దక్కించుకుంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో 10,829 వద్ద స్థిరపడింది.
ఇదీ కారణం
ఆర్థికవ్యవస్థ మందగమనం నేపథ్యంలో కేంద్రం ఉద్దీపన చర్యలు ప్రారంభించినట్లు మదుపర్లు అంచనా వేశారు. కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 36,807 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 36,102 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 10,862 పాయింట్ల అత్యధిక స్థాయి.. 10,637 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
వేదాంత 6.55 శాతం, ఎస్ బ్యాంకు 5.24 శాతం, ఓఎన్జీసీ 4.66 శాతం, ఎం&ఎం 4.26 శాతం, టాటా స్టీల్ 3.43 శాతం, ఎన్టీపీసీ 3.36 శాతం, లాభాలను నమోదు చేశాయి.
ఇండస్ఇండ్ బ్యాంకు 1.90 శాతం, ఐటీసీ 1.71 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 0.85 శాతం, పవర్ గ్రిడ్ 0.69 శాతం, ఎల్&టీ 0.55 శాతం నష్టాల్లో ముగిశాయి.
ఇదీ చూడండి: మన రోడ్లపై పెరుగుతున్న లగ్జరీ కార్ల రయ్ రయ్