ETV Bharat / business

Covaxin: అమెరికాలోని పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా? - పిల్లల వ్యాక్సిన్​

18 ఏళ్ల లోపు పిల్లలకు కొవాగ్జిన్​ టీకా(Covaxin) ఇచ్చేందుకు అమెరికా ఔషధ నియంత్రణ మండలి-ఎఫ్​డీఏ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసినట్లు భారత్​ బయోటెక్​ భాగస్వామ్య సంస్థ ఆక్యుజెన్​ ఇంక్​ వెల్లడించింది(covaxin ocugen). భారత్​లో నిర్వహించిన 2-3 దశల క్లినికల్​ పరీక్షల సమాచారం ఆధారంగా దరఖాస్తు చేసినట్లు తెలిపింది.

Covaxin
కొవాగ్జిన్‌ టీకా
author img

By

Published : Nov 6, 2021, 7:00 AM IST

అమెరికాలోని పిల్లలకు 'కొవాగ్జిన్‌' టీకా(Covaxin) ఇచ్చేందుకు అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఏ) కోరుతూ అమెరికాలోని భారత్‌ బయోటెక్‌(Bharat biotech) వ్యాపార భాగస్వామ్య సంస్థ ఆక్యుజెన్‌ ఇంక్‌ దరఖాస్తు(covaxin ocugen) చేసింది. 2- 18 ఏళ్ల వయస్సు పిల్లలకు టీకా ఇవ్వటానికి వీలుగా అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి కోరుతూ దరఖాస్తు దాఖలు చేసినట్లు ఆక్యుజెన్‌ ఇంక్‌ తాజాగా వెల్లడించింది.

భారత్‌లో దాదాపు 526 మంది పిల్లలపై ఈ టీకా(Corona vaccine) ఎలా పనిచేస్తుందనే విషయమై నిర్వహించిన 2-3 దశల క్లినికల్‌ పరీక్షల సమాచారం ఆధారంగా ఈ దరఖాస్తు చేసినట్లు ఆక్యుజెన్‌ ఇంక్‌. పేర్కొంది. దీన్ని యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదిస్తే, అమెరికాలో పిల్లలకు అందుబాటులోకి వచ్చిన కొవిడ్‌-19 రెండో టీకా కొవాగ్జిన్‌ అవుతుంది.

'కొవాగ్జిన్‌'కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల అత్యవసర వినియోగ గుర్తింపు ఇచ్చిన విషయం విదితమే. ఇప్పటివరకు మనదేశంతో పాటు వివిధ దేశాల్లో 10 కోట్ల డోసులకు పైగా 'కొవాగ్జిన్‌' టీకా ఇచ్చారు.

ఇదీ చూడండి: కొవాగ్జిన్​కు 'ప్రపంచ' గుర్తింపు- ఇక టీకా ఉత్పత్తి జోరు ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.