పిల్లల్ని ఆక్టటుకునే రీతిలో రూపొందించిన 'బేబీ షార్క్' వీడియో సాంగ్ సోమవారంతో 700 కోట్ల (7 బిలియన్) వీక్షణలను అందుకుంది. తెలిసిన చిన్న చిన్న క్యాచీ పదాలతో దక్షిణ కొరియా రూపకర్తలు రూపొందించిన ఈ పాట చిన్నారులను విశేషంగా మెప్పించింది. ఇప్పటి వరకు అత్యంత వీక్షణలను పొందిన 'డెస్పాసిటో' యూట్యూబ్ పాటను దాటేసి..ఈ రికార్డును సొంతం చేసుకుంది.
దక్షిణ కొరియాకు చెందిన పింక్‌ఫాంగ్ అమెరికాకు చెందిన క్యాంప్ ఫైర్ పాటకు రీమిక్స్‌గా దీన్ని రూపొందించి 2016 జూన్‌లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. కాగా, 2019లో బిల్‌బోర్డ్ హాట్ 100లో 32వ స్థానాన్ని కూడా పొందింది.
పిల్లలతో పాటు పెద్ద వాళ్లను కూడా ఈ పాట మెప్పించింది. ది వాషింగ్టన్ నేషనల్ బేస్‌బాల్ టీమ్ దీన్ని ఒక గీతంగా చేర్చుకొని..గత సంవత్సరం సిరీస్‌ను గెలుచుకోవడం గమనార్హం. నిరాశ్రయులు బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడకుండా చూసేందుకు ఫ్లొరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ ఈ మెలోడిని ఉపయోగించింది. మరోవైపు, ఈ కరోనా కాలంలో చేతులు శుభ్రం చేసుకోవాల్సిన అవసరాన్ని వెల్లడిస్తూ..అదే మ్యూజిక్‌తో 'వాష్ యువర్ హ్యాండ్స్' అనే థీమ్ సాంగ్‌ను పింక్‌ఫాంగ్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. గతంలో కూడా దక్షిణ కొరియాకు చెందిన గంగ్‌నమ్ స్టైల్, సీ యూ ఎగైన్ కూడా ఇలాగే పాపులర్ అయ్యాయి.