గత నెలలో ముగిసిన బైబ్యాక్ ఆఫర్లో.. అజిమ్ ప్రేమ్‌జీ సహా ఇతర ప్రమోటర్ గ్రూపు సంస్థలు రూ.7,300 కోట్లకు 22.46 కోట్ల షేర్లు విక్రయించినట్లు దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ప్రకటించింది.
పూర్తి బైబ్యాక్ ఆఫర్లో ఒక్కో షేర్‌కు రూ.325 చొప్పున మొత్తం.. 32.3 కోట్ల షేర్లు కొనుగోలు చేసినట్లు బీఎస్ఈకి నివేదించింది విప్రో. బైబ్యాక్ కోసం రూ.10,499.99 వెచ్చించినట్లు పేర్కొంది.
ఈ బైబ్యాక్ ద్వారా కొనుగోలు చేసిన షేర్లలో.. అజిమ్ ప్రేమ్‌జీ భాగస్వామ్యంలోని జష్ ట్రేడర్స్‌కు ఉన్న 6.12 కోట్ల షేర్లు, ప్రజిమ్ ట్రేడర్స్‌కు చెందిన 6.03 కోట్ల షేర్లు, హశమ్ ట్రేడర్స్‌కు చెందిన 5.02 కోట్ల షేర్లు ఉన్నట్లు విప్రో తెలిపింది.
వీటితోపాటు అజిమ్ ప్రేమ్‌జీ ట్రస్ట్‌కు చెందిన 4.05 కోట్ల షేర్లు, అజిమ్ ప్రేమ్‌జీకి చెందిన 1.22 కోట్ల షేర్లు బై బ్యాక్ చేసినట్లు విప్రో పేర్కొంది. ఈ బైబ్యాక్ ఆఫర్‌కు ప్రేమ్ జీ అంగీకరించినట్లు స్పష్టం చేసింది విప్రో.
ఇదే ఆఫర్లో ఎల్ఐసీ వద్ద ఉన్నవాటిలో 1.34 కోట్ల షేర్లు బైబ్యాక్ చేసినట్లు పేర్కొంది విప్రో. ఈ భారీ బైబ్యాక్ ఆఫర్ ముగిసిన తర్వత విప్రోలో 74.05 శాతం వాటా ప్రమోటర్ల హస్తగతమైంది.
ఇదీ చూడండి: సాంకేతికం: ఐఫోన్11 వచ్చేసిందోచ్.. ధరెంతంటే..!