గూగుల్ మ్యాప్స్పై ఆస్ట్రేలియా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది.
ఆడ్రాయిడ్ ఫోన్, టాబ్లెట్ యూజర్లకు సంబంధించి సున్నితమైన వ్యక్తిగత లోకేషన్ సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్ సేకరించి భద్రపరుస్తోందని ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ) పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆయా యూజర్లకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించింది.
ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ లొకేషన్ డేటా సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్ తెరపై తక్కువ సమాచారం ఇచ్చి, యూజర్లను తప్పుదోవ పట్టించినట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలో గూగుల్‌కు భారీ జరిమానా విధించనున్నట్లు ఏసీసీసీ ఛైర్మన్ ఆడమ్ సీమ్స్ తెలిపారు. గూగుల్ గతంలోనూ ఇలాంటి పొరపాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారాయన. ఇప్పుడు అలాంటి పొరపాటే చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు ఉండవని గూగుల్ స్పష్టతనివ్వాలని ఆదేశించినట్లు ఆడమ్ సీమ్స్ తెలిపారు.
ఈ వివాదంపై స్పందించిన గూగుల్... వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని.. వారికి మెరుగైన సేవలు అందించేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. ఇతర అవసరాలకు ఆ సమాచారం వాడడం లేదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ప్రీ పెయిడ్.. పోస్ట్ పెయిడ్.. ఏ ప్లాన్ ఉత్తమం..!