ప్రపంచ చమురు ధరల్లో పెరుగుదల కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధర ఒక శాతం పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
ఏటీఎఫ్ ధరలు పెరగటం వరుసగా ఇది రెండో నెల. దీంతో ప్రస్తుతం కిలో లీటర్ ఏటీఎఫ్‌పై (దిల్లీలో) రూ.677 పెరిగి... రూ.63,472.22 కు చేరింది. ఏటీఎఫ్ ధర గత నెల అత్యధికంగా 8.1 శాతం (రూ.4,734.15) పెరిగింది.
ధరలు పెరగటం... ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విమాన సంస్థలకు భారంగా మారనుంది.
ఇక రాయితీ లేని వంట గ్యాస్‌పై రూ.5 పెంచాయి చమురు సంస్థలు. పెరిగిన ధరతో రాయితీ లేని 14.2 కిలోల సిలిండర్ ధర (దిల్లీలో) రూ.706.50కు చేరింది.
రాయితీ ఇచ్చే వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు చమురు సంస్థలు. ప్రస్తుతం దీని ధర రూ.495.86గా ఉంది.