ఎప్పటినుంచో ఊరిస్తున్న 'యాపిల్ టీవీ ప్లస్' సేవలను ఎట్టకేలకు ఆవిష్కరించింది ఎలక్ట్రానిక్ దిగ్గజం యాపిల్. ఈ సేవల ప్రారంభంతో ఓటీటీ సేవల మార్కెట్లో అగ్రగామిగా దూసుకుపోతున్న నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లకు యాపిల్ గట్టి పోటీ ఇవ్వనుంది.
టీవీ ప్లస్ సేవల నెలవారీ చందా 5 డాలర్లుగా నిర్ణయించింది యాపిల్. ఈ నెలవారీ చందా నెట్‌ఫ్లిక్స్‌తో పోలిస్తే సగం కన్నా తక్కువ. నెట్‌ఫ్లిక్స్ నెలవారీ చందా 13 డాలర్లుగా ఉంది. అమెజాన్ ప్రైమ్ నెలవారీ చందా 9 డాలర్లు మాత్రమే.
ఇదే సమయంలో నెట్‌ఫ్లిక్స్‌కు పోటీగా మరో దిగ్గజ సంస్థ వాల్ట్ డిస్నీ తన వీడియో సేవలను నవంబర్ నుంచే తీసుకు రానున్నట్లు తెలిపింది. వాల్ట్ డిస్నీ ప్రీమియంను నెలకు 7 డాలర్లుగా నిర్ణయించింది.
యాపిల్ టీవీ ప్లస్‌తో పాటు.. యాపిల్ ఆర్కేడ్ పేరుతో వీడియో గేమ్‌లు ఆడుకునే సదుపాయాన్ని యాపిల్ ఆవిష్కరించింది. ఈ సేవలు వినియోగించుకునేందుకు నెలకు 5 డాలర్ల చందాను వసూలు చేయనున్నట్లు తెలిపింది. యాపిల్ ఆర్కేడ్ సేవలు నవంబర్ 19 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఇదీ చూడండి: అజిమ్ ప్రేమ్‌జీ నుంచి 1.22 కోట్ల షేర్ల బైబ్యాక్!