టెక్ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తొలిసారి ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. మార్కెట్ విలువపరంగా యాపిల్ ఇటీవల 1.84 ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటి.. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది. అదే జోష్తో 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ వైపు దూసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో టిమ్ కుక్ సంపద కూడా తొలి సారి 1 బిలియన్ మార్క్ దాటింది.
అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ (187.7 బిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్గేట్స్ (121 బిలియన్ డాలర్లు), ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ (102 బిలియన్ డాలర్ల)తో పోలిస్తే టిక్ కుక్ చాలా వెనుకబడి ఉన్నారు.
గత ఏడాది లెక్కల ప్రకారం.. టిమ్ కుక్కు యాపిల్ సంస్థలో 847,969 షేర్లు ఉన్నాయి. 125 మిలియన్ డాలర్లు 2019 వార్షిక వేతనంగా పొందారు.