తమకు రావాల్సిన రూ.550 కోట్ల రుణాన్ని చెల్లించాల్సిందిగా రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్)ను ఆదేశించాలని ఎరిక్సన్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
విచారణకు అనిల్ అంబానీ సహా రిలయన్స్ టెలికాం చైర్మన్ సతీష్సేత్, ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ చైర్మన్ ఛాయ విరాణి జస్టిస్ నారీమన్, వినీత్ శరణ్ ధర్మాసనం ముందు హజరయ్యారు. బుధవారం కూడా విచారణకు రావాలని కోర్టు వారిని ఆదేశించింది.
ఇంతకు ముందు కోర్టు ఇచ్చిన రెండు ఆదేశాలను పాటించకుండా ఆర్‌కామ్ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఎరిక్సన్ తరపు న్యాయవాది దుశ్యంత్ వాదనలు వినిపించారు.
ఒకవేళ రుణం చెల్లించడంలో విఫలమైతే అంబానీ, సేత్, విరాణిలపై సివిల్ కేసు నమోదు చేసి అరెస్టుకు ఆదేశించాలని ఎరిక్సన్ పిటిషన్లో కోరింది.
ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
పోయిన ఏడాది డిసెంబర్ 15లోపు రుణాన్ని తిరిగి చెల్లించాలని గతంలో ఆర్‌కామ్ సుప్రీంని ఆదేశించింది. ఈ గడువు దాటితే సొమ్ముపై 12 శాతం వడ్డీ చెల్లించాల్సింటుందని స్పష్టం చేసింది. అయితే రుణ చెల్లింపులో విఫలమైంది ఆర్‌కామ్. దీంతో ఎరిక్సన్ మళ్లీ సుప్రీం తలుపుతట్టింది.
2014లో ఆర్‌కామ్ నెట్‌వర్క్‌ను ఏడు సంవత్సరాల పాటు నిర్వహించేందుకు ఎరిక్సన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి 1500 కోట్లు ఎరిక్సన్కు ఆర్‌కామ్ బకాయి పడింది. దీనిపై అప్పట్లో జాతీయ లా ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది ఎరిక్సన్. సుప్రీంలో 1500 కోట్లకు బదులు ఒకేసారి 550కోట్లు చెల్లింపునకు ఎర్సికన్కు- ఆర్‌కామ్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఇదీ అమలు కాలేదు.