జియో వచ్చాక టెలికాం రంగంలో పోటీ బాగా పెరిగిపోయింది. వినియోగదారులను ఆకర్షించేందుకు అన్ని టెలికాం సంస్థలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించడం సాధారణం. అదే బాటలో ఎయిర్టెల్ కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు బంపర్ బొనాంజా ప్రకటించింది. కొత్తగా 4జీ సిమ్‌ను తీసుకున్న, 4జీ డివైస్‌కు అప్‌గ్రేడ్ అయిన వినియోగదారులకు 11 జీబీ వరకు డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే ఇది రెండు రకాలుగా వినియోగదారులకు అందనుంది. ఈ ఆఫర్ ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని ఎయిర్టెల్ పేర్కొంది.
కొత్త వినియోగదారుడైతే..
ఎయిర్టెల్ అందించే 11జీబీ డేటాను రెండు విడతల్లో పొందే అవకాశం ఉంది. అందులో మొదటిది.. కొత్తగా ఎయిర్టెల్ 4జీ కస్టమర్ 'ఎయిర్టెల్ థ్యాంక్స్' యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే 5జీబీ డేటా వస్తుంది. అయితే ఈ డేటా మొత్తం ఐదు 1జీబీ కూపన్ల రూపంలో మూడు రోజుల వ్యవధిలో యాప్‌లో క్రెడిట్ అవుతుంది. కొత్త మొబైల్ నంబర్ యాక్టివేట్ అయిన నెల రోజుల్లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఐదు కూపన్లు వస్తే.. యాప్‌లోని 'మై కూపన్స్' సెక్షన్‌కు వెళ్లి వాటిని క్లెయిమ్ చేసుకోవాలి. అయితే 1జీబీ డేటా కూపన్‌ను యాప్‌లో క్రెడిట్ అయిన 90 రోజుల్లోగా రీడిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. 'ఎయిర్టెల్ థ్యాంక్స్' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోకపోతే 5జీబీ డేటాకు బదులు 2జీబీ డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అన్లిమిటెడ్ ప్యాకేజీతో..
ఇక ఎయిర్టెల్ కూడా తన అన్లిమిటెడ్ ప్యాకేజీ తీసుకునే వినియోగదారులకు దాదాపు 6జీబీ డేటా వరకు ఉచితంగా అందివ్వనుంది. 84 రోజుల వాలిడిటీతో రూ.598 అంతకంటే ఎక్కువ మొత్తం ప్యాకేజీలను ఎంచుకునే కస్టమర్లకు 6జీబీ డేటా ఉచితంగా వస్తుందని ఎయిర్టెల్ వెబ్సైట్లో పేర్కొంది. అయితే ఈ డేటా అంతా ఒక్కసారిగా రాదు. వినియోగదారులు ఆరు 1 జీబీ ఉచిత డేటా కూపన్ల రూపంలో వస్తుంది. అలానే రూ.399 అంతకంటే ఎక్కువ ప్లాన్ తీసుకుంటే నాలుగు కూపన్లు, రూ. 219 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే రెండు కూపన్లు వస్తాయి. 'ఎయిర్టెల్ థ్యాంక్స్' యాప్ ద్వారా రీఛార్జి చేయాల్సి ఉంటుంది. కొత్త 4జీ ఎయిర్టెల్ కస్టమర్ అయి ఉండి రూ.598 ప్రీపెయిడ్ ప్యాక్‌ను తీసుకుంటే మొత్తం 11జీబీ డేటా పొందే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:కీలక వడ్డీ రేట్లు మళ్లీ యథాతథమే!