విమాన ప్రయాణికులకు పెద్ద శుభవార్త. 50 శాతం తక్కువ ధరకే టికెట్ పొందాలనుకుంటే కేరాఫ్ అడ్రెస్ ఎయిర్ ఇండియా. చివరి నిమిషంలో టికెట్లు కోరే వారికి ఇలా తక్కువ ధరకే అమ్మనున్నట్లు ప్రకటించిందీ సంస్థ.
చౌకగా టికెట్లు దక్కించుకునేందుకు పెద్ద తతంగం ఉంటుందండోయ్. మీరు బ్యాగు సర్దుకుని విమానాశ్రయాల్లో వేచి చూడాల్సి ఉంటుంది. ఇదేమంటారా? ఎయిర్ ఇండియా నిబంధన అలాగే ఉంది మరి. విమానం బయలుదేరడానికి ముందు మూడు గంటల్లోపు టికెట్లు కోరే వారికి ఇలా 50 శాతం తక్కువకే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ.
సాధారణంగా చివరి నిమిషంలో టికెట్లకు విమానయాన సంస్థలు 40 శాతం అధికంగా వసూలు చేస్తాయి. జెట్ ఎయిర్వేస్ మూతపడిన అనంతరం టికెట్ల రేట్లు భారీగా పెంచేశాయి. డిమాండ్ సప్లైలో భారీ వ్యత్యాసాలున్న కారణంగా ఎయిర్ ఇండియా తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఎయిర్ ఇండియా నిర్ణయంతో అత్యవసర ప్రయాణికులు తక్కువ ధరకే టికెట్లను పొందే అవకాశం లభించింది. టికెట్ కౌంటర్లు, వెబ్సైట్, మొబైల్ యాప్, ఏజెంట్స్ ద్వారా టికెట్లను పొందవచ్చని ప్రకటించింది ఆ సంస్థ.
ఇదీ చూడండి: ఆరో దశ ప్రచారానికి తెర- 12న పోలింగ్