ETV Bharat / business

'ఎస్ బ్యాంకు ఖాతాదారుల డబ్బు సురక్షితమే' - rbi governor news

ఎస్​ బ్యాంకు మారటోరియం కారణంగా ఆ బ్యాంకు ఖాతాదారులకు ఎలాంటి నష్టం జరగదని భరోసా ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఆర్బీఐ గవర్నర్​తో పాటు కేంద్ర ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి కూడా డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేశారు.

nirmala
నిర్మల
author img

By

Published : Mar 6, 2020, 2:47 PM IST

ఎస్ బ్యాంక్ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ స్పందించారు. బ్యాంకు ఖాతాదారులకు ఎలాంటి నష్టం జరగదని భరోసా ఇచ్చారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ కృషి చేస్తోందని తెలిపారు.

"ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తున్నాం. ఏ ఒక్క డిపాజిటర్​కు నష్టం జరగదని నాకు ఆర్బీఐ గవర్నర్​ హామీ ఇచ్చారు. ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక వ్యవస్థ, బ్యాంకులను కాపాడేందుకే తాజా చర్యలు తీసుకున్నాం. తక్షణ ఉపశమనం కోసం రూ.50వేలను విత్​డ్రా చేసుకునేందుకు అవకాశం ఇచ్చాం."

- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

30 రోజుల్లో పరిష్కరిస్తాం..

ఎస్​ బ్యాంక్​ సమస్యను 30 రోజుల్లోనే పరిష్కరిస్తామని ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. దేశంలో బ్యాంకింగ్​ రంగం స్థిరత్వాన్ని సాధించేందుకే ఎస్​ బ్యాంక్​పై మారటోరియాన్ని విధించామని తెలిపారు.

బ్యాంకింగ్​ రంగంలో ప్రక్షాళనకు ఇదే సరైన సమయమని.. త్వరలోనే ఎస్​ బ్యాంకును పునరుద్ధరించేందుకు కొత్త పథకంతో ముందుకు వస్తామని హామీ ఇచ్చారు.

డిపాజిటర్ల డబ్బు సురక్షితం..

ఎస్ బ్యాంకు పునరుద్ధరణలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని భారత ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్​ స్పష్టం చేశారు. ఆర్బీఐ సరైన నిర్ణయాలు తీసుకుందని ఆయన అన్నారు. ఫలితంగా ఖాతాదారుల అందరి డబ్బు సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: యెస్​ బ్యాంక్​పై మారటోరియం- సగం వాటా ఎస్బీఐకి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.